ప్రమాదఘంటికలు మోగిస్తున్న హిమాలయాలు..

0
324
The Himalayas are ringing alarm bells

హిమాలయ పర్వత సానువులు… ప్రపంచంలోనే అతి సుందరమైనవి. భారతదేశంతో పాటు చైనా, టిబెట్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లతో పాటు మరికొన్ని దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది.

ముఖ్యంగా మన దేశానికి రక్షణ కవచంలా హిమాలయ పర్వత శ్రేణులు నిలబడ్డాయి. నిత్యం మంచు దుప్పటిని కప్పుకుని ఎన్నో నదులకు జీవధార అయిన హిమాలయాలు కాలుష్యం భారిన పడి తమ ఉనికిని కోల్పోతున్నాయని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నారు.

అయినా ప్రపంచం కాలుష్యాన్ని పెంచి పోషిస్తూనే ఉంది. ఈ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఊహించనంత వేగంగా హిమాలయాలు కాలుష్యం భారిన పడుతున్నాయి.

తాజాగా ఓ బయటపడిన ఓ వాస్తవం హిమాలయాల మనుగడపట్ల దిగ్భ్రాంతిని కలిగించేలా ఉంది. సహజంగా శీతాకాలంలో అధిక మంచు కురవడంతో అనేక ప్రాంతాలో మంచుతో కప్పబడి ఉంటాయి.

దాదాపు 12వేల అడుగుల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని జోజిలా కనుమల నుంచి మన దేశంలోని లద్దాఖ్‌ను కలిపే రహదారి ఈ సమయానికి తీవ్రమైన మంచు తాకిడికి గురౌతుంది.

దాదాపు 30 నుంచి 40 అడుగుల మేర మంచు పేరుకు పోయి ఉంటుంది. ఈ కారణంగా మన దేశ సరిహద్దు రహదారి సంస్థ ఈ మంచును తొలగించటానికి నానాపాట్లు పడుతూ ఉంటుంది. 30 నుంచి 40 అడుగుల మేర మంచు తొలగించడం అంటే మాటలు కాదుకదా.

Bandla Ganesh got angry at the press meet

ఈ సంవత్సరం కూడా ఈ మంచు తొలగింపు కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేసుకుంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లగా అక్కడ కేవలం 6 నుంచి 7 అడుగుల మేర మాత్రమే మంచు కప్పబడి ఉందట.

అంతకంటే విస్తుగొలిపే విధంగా కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌, పహల్‌గావ్‌ ప్రాంతాలలో అయితే మంచు ఏ మాత్రం కనిపించలేదట. ఇది అధికారులను టెన్షన్‌లో పడేసింది.

అలాగే ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కూడా మంచు అనూహ్యంగా తగ్గిపోవడంతో కాలుష్యం ఏ స్థాయిలో పెరగకపోతే ఇంత తేడా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల కాలంలో ఎల్‌నినోలు ఏర్పడటం వల్ల వేడి పెరిగిందని, అదే సమయంలో చల్లదనాన్ని మోసుకొచ్చే వెస్ట్రన్‌ డిస్ట్రబెన్సెస్‌ (డబ్ల్యూడీ)లు డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ 4 నుంచి 6 ఏర్పడాల్సి ఉండగా,

ఇప్పటి వరకూ కేవలం ఒక్కటి మాత్రమే ఏర్పడిరదట. శీతల గాలులకు, మంచు ఏర్పడటంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరిస్థితులను గమనిస్తుంటూ హిమాలయాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లుగానే తోస్తోంది.