చైతూతో స్టార్ హీరో కూతురు.. వైరల్ అవుతున్న వీడియో

0
1375

సమంతతో నాగ చైతన్య డైవర్స్ తీసుకున్నాక సోషల్ మీడియాలో కానీ బయటకానీ పెద్దగా కనిపించడం లేదు. చాలా రిజర్వ్ గా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణ అంత్యక్రియలకు వచ్చి నివాళులర్పించి త్వరగానే అక్కడి నుంచి వెళ్లిపోయారట. మీడియా ముందుకు రాకుండా, అటు సోషల్ మీడియాలోకి కూడా రాకుండా ఉంటున్నాడట నాగ చైతన్య. ఇక సమంత విషయానికి వస్తే అరుదైన వ్యాధి ‘వయోసైటిస్’తో బాధపడుతుంది. ఆమెను నాగ చైతన్య పరామర్శించినట్లు టాక్ ఉన్నా.. మీడియా ముందుకు మాత్రం రాలేదు. సమంతతో డైవర్స్ అయిన తర్వాత నాగ చైతన్య మరొకరితో డేట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

బావా అంటూ పరిచయం చేసుకున్నది

ఈ వార్తలు కొనసాగుతుండగానే రీసెంట్ గా ఆయన మరో వీడియో బయటకు వచ్చింది. దీంతో నెట్టింట్లో కామెంట్లు, గాసిప్ లు మొదలయ్యాయి. ‘ఈ వీడియోలో నాగ చైతన్యను వాటేసుకుని బావా అంటూ పరిచయం చేసుకున్నది’ ఎవరనీ చర్చ మొదలైంది. ఆ అమ్మాయి ఎవరనేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నాగ చైతన్యతో కలిసి రెసిపీ తయారు చేసిన ఈ యూట్యూబ్ బ్లాగర్ ఎవరో కాదు స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత. వీడియో చైతన్య, అశ్రిత కలిసి వంట చేయడం, ఇద్దరూ తింటూ వీడియో తీసుకోవడం, మాట్లాడుకోవడం కనిపిస్తుంది.

యూరప్ లో ఉంటున్న అశ్రిత

అశ్రిత ప్రస్తుతం యూరప్ లోని బార్సిలోనాలో ఉంటుంది. ఆమెకు పెళ్లయి భర్తతో కలిసి అక్కడే నివసిస్తుంది. ‘ఇన్ఫినిటీ ఫ్లాటర్’ అనే యూ ట్యూబ్ ఛానల్ పెట్టి ప్రపంచంలోని వెరైటీ ఫుడ్లను వ్యూవర్స్ కు పరిచయం చేస్తుంది అశ్రిత. ఆమె తయారు చేసిన రెసిపీల ద్వారా చాలా ఫేం సంపాదించుకుంది. దీంతో ఆమె తెగ సంపాదిస్తుందట. ఎంతంటే ఒక సినిమాలో నటించే హీరోయిన్ రెమ్యునరేషన్ కన్నా ఎక్కువగా సంపాదిస్తుందట అశ్రిత.

నాగ్ తో కలిసి అశ్రిత రెసిపీ ప్రిపేర్

అశ్రిత ఇటీవల తన మేనబావ నాగ చైతన్యతో కలిసి ఒక వంటకాన్ని తయారు చేసింది. మొదటగా బావతో కలిసి చేస్తున్న వెరైటీ రెసిపీ అంటూ పోస్ట్ చేసింది. ఇందులో నాగ చైతన్యతో పాటు ఆమె కూడా వారు తయారు చేసిన వంటకాన్ని తిని వాహ్.. వా.. అన్నారు. ఇటీవల వెంకటేశ్ కూతురు అశ్రిత హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె సంసార జీవితం బాగానే ఉందా? లేక చైతన్యతో కలిసి రెండో ఇన్నింగ్స్ ఏమైనా ప్రారంభించిందా? లేదంటే సరదాగా ప్రోగ్రాం కోసమే చైతన్యతో కలిసి వీడియో తీసుకుందా? అని నెటిజన్లకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఇవన్నీ ఊహాగానాలకే వదిలేసినా మున్ముందు ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది మరీ.