పుష్ప2 పాటలు కంప్లీట్.. మళ్లీ ఐటం సాంగ్ తో ఉందంటున్న డీఎస్పీ..?

0
977

‘ఆకును తింటది మేక.. మేకను తింటది పులి..’ ఈ పాట గుర్తుండే ఉంటుంది కదా.. పుష్పలో బాగా హిట్ సాంగ్.. దీంతో పాటు ‘రారా సామీ’ ఈ సాంగ్ కూడా పుష్పలోదే.. పుష్ప రిలీజై ఏడాది పూర్తయినా వీటికి ఇంకా ఆదరణ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ వ్యవహరించారు. చాలా రోజులుగా హిట్ సాంగ్స్ లేక కొట్టుమిట్టాడుతున్న దేవీకి ఈ సినిమా పాటలు, ఇందులోని బ్యాగ్రౌండ్ స్కోర్ ఊరటనిచ్చింది.

రష్యాలో ప్రమోషన్ లో దూసుకుపోతున్న టీం

అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ ‘పుష్ప’. ఈ మూవీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ హీరోగా కూడా బాగా మెప్పించారు అర్జున్. ఈ మూవీ మొదటి టాలీవుడ్ ఇండస్ర్టీలో రిలీజైనా దానికి వచ్చిన క్రేజ్ ను చూసి తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. దీంతో పాన్ ఇండియా మూవీగా ఇది బాక్సాఫీస్ హిట్లను తిరగరాసింది. పార్ట్ 1తో ఇంత క్రేజ్ సంపాదించున్న పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమైంది. ఇక పార్ట్ 1 దాదాపు రూ. 350 గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇది 2021లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరనే చెప్పాలి.

పార్ట్ 2పై యూనిట్ ప్రత్యేక శ్రద్ధ

రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ లో రిలీజవుతున్న ఈ మూవీ ప్రమోషన్ లో కూడా దూసుకుపోతుందని చిత్ర యూనిట్ చెప్తుంది. ఇక పార్ట్ 2 మేకింగ్ విషయంలో సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అందుకు పాత స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసినట్లు ఇటీవల ఆయన తెలిపారు. పార్ట్ 1 ఇంత హిట్ అవుతుందని ఊహించలేదని, పుష్ప హిట్ తో తర్వాతి పుష్ప 2పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ను కూడా తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మళ్లీ పుంజుకున్న దేవీశ్రీప్రసాద్

దేవి సినిమాతో తన మ్యూజిక్ వండర్ ను స్ట్రార్ట్ చేసిన ‘దేవి శ్రీపాద్’ తన దైన స్టయిల్ లో ట్యూన్స్ క్రియేట్ చేస్తూ ఇండస్ర్టీలో దూసుకుపోతున్నారు. కానీ ఈ మధ్య ఆశించిన స్థాయిలో ఆయనకు ట్యూన్స్ కుదరక మరుగున పడిపోయారు. పుష్పకు పనిచేయాల్సిందిగా సుకుమార్ చెప్పినప్పుడు ఆయన ఈ ప్రాజెక్టుపై ఎక్కువగా శ్రమించారట. ఇందులో భాగంగానే సూపర్ హిట్ సాంగ్ వచ్చాయి. పుష్ప సాంగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.

పుష్ప2కు ఐటం సాంగ్ తో సహా 3 పాటలు పూర్తి

పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా రోజుల నుంచి పని చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఇప్పటి వరకూ దాదాపు 3 పాటలను కూడా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప లో మాదిరిగానే ఇందులోనూ ఒక ఐటం సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లు. ఐటం సాంగ్ కు సంబంధించి కూడా కంపోజింగ్ పూర్తయిందని వాటిని నిర్మాత అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐటం సాంగ్ కూడా స్టార్ హీరోయినే చేయబోతుందని టాక్. పార్ట్ 2లో కూడా తన మ్యూజిక్ తో అలరించనున్నాడు దేవిశ్రీ ప్రసాద్.

పుష్ప 2కు అంతా సిద్ధం

ఇక పుష్ప 2కు షూటింగ్ ప్రారంభించేందుకు టీం రెడీగా ఉంది. కానీ ఈ మూవీని ఇటీవల రష్యన్ లాంగ్వెజ్ లో రష్యాలో డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా టీం అక్కడకు వెళ్లింది. దీంతో కొంత గ్యాప్ వచ్చింది. వారు తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ తెలుపుతున్నారు. సీక్వెల్ పార్ట్ కోసం ఈ సారి బడ్జెట్ పెంచినట్లు తెలుస్తోంది. దాదాపు పుష్ప 2కు రూ. 350 కోట్ల వరకూ వెచ్చించనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.