అభిమాని కాళ్లు మొక్కిన ఆ స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో

0
376

నటులకు, అభిమానులకు భావోద్వేకమైన సంబంధం ఉంటుంది. ఒకరు లేకుండా ఒకరు ఉండనేది అక్షర సత్యం. వారు చూపిన నటనకు అభిమానులు ఫిదా అయితే.. అభిమానుల కోసమే చాలా సినిమాలు వదులుకున్న వారు కూడా ఇండస్ర్టీలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఇటీవల ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కలిసిన తన అభిమాని ఆమెను పట్టుకొని ఆనంద భాష్పాలు రాలుస్తూ ఏడ్చేసింది. దానికి స్పందించిన ఆ తార ఆమెను అక్కున నేర్చుకొని ఓదార్చి గిఫ్ట్ ఇచ్చి తన కారులో గమ్యం వరకూ తీసుకెళ్లి వదిలేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో అప్పట్లో నెట్ లో చాలా వైరల్ అయ్యింది.

కాలేజ్ కు వచ్చిన చిత్ర బృందం

రీసెంట్ గా ఇలాంటి ఒక సన్నివేశం జరిగింది. ఒక మూవీ ప్రమోషన్ ఈవెంట్ కు వచ్చిన అభిమాని తన స్టార్ హీరోను చూసి తీవ్రంగా స్పందించింది. ఆమె అభిమానాన్ని చూసిన ఆ హీరో ఆమె కాళ్లు మొక్కాడు. ఇది కూడా ప్రస్తుతం నెట్ లో తెగ వైరల్ అవుతుంది. దీని గురించి తెలుసుకుందాం.

వేద్ ప్రమోషన్ ఈవెంట్

టాలీవుడ్ లో ‘బొమ్మరిల్లు’లో నటించి అవార్డులు గెలుచుకున్న నటి జెనీలియా డిసౌజా. ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. బొమ్మరిల్లులో ఆమె హాసిని పాత్రకు జీవం పోశారు. ఆమె రాంతో కలిసి నటించిన రెడీ మూవీ కూడా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత ఆమె రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని నటనకు కొంచెం బ్రేక్ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె తన భర్త రితేశ్ తో కలిసి ‘వేద్’ మూవీలో నటిస్తోంది. తెలుగు ‘మజిలీ’కి ఈ మూవీ రిమేక్. ‘వేద్’ ట్రైలర్ ఇటీవల రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఒక ఈవెంట్ కండెక్ట్ చేసింది. ఈ ఈవెంట్ కు తన భర్త రితేశ్ తో కలిసి ఆమె పాల్గొంది. ఈ వెంట్ వేధికగా రితేశ్ చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది.

అభిమాని కాళ్లు మొక్కిన రితేశ్

రితేశ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎక్కువగా ఇందులో యువతులు ఉండడం విశేషం. ఈవెంట్ లో భాగంగా ఓ కాలేజ్ కు చిత్ర యూనిట్ వచ్చి చేసింది. ఇందులో భాగంగా రితేష్ అభిమాని అయిన ఒక అమ్మాయి ఆయన వద్దకు వచ్చింది. తనతో డ్యాన్స్ చేయాలని రితేశ్ ను కోరింది. ఆమెతో డ్యాన్స్ చేసేందుకు ఆయన సమ్మతిండంతో ఆమె ఆనందానికి పగ్గాలు లేవు. డ్యాన్స్ తర్వాత తను వేసిన రితేశ్ చిత్రాలను చూపించి ఆటోగ్రాఫ్ కావాలని అడిగింది. ఆయన కూడా ఇచ్చాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన కాలేజ్ యువతి హీరో రితేశ్ కాళ్లు మెక్కేందుకు ప్రయత్నించింది. దీంతో వద్దని చెప్పిన ఆయన ఆమె కాళ్లు మొక్కాడు. ఫ్యాన్స్ పట్ల రితేశ్ తీరును చూసిన అందరూ ఫిదా అయ్యారు.

డిసెంబర్ 30న థియేటర్స్ లోకి

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం కొందరికే చెల్లుతుందని అందులో రితేశ్ కూడా ఉన్నాడని అక్కడి వారంతా చెప్పుకున్నారు. ఇక ‘వేద్’ మూవీలో రితేశ్ నటించడంతో పాటు స్వయంగా నిర్మించాడు కూడా. ఇందులో రితేశ్ కు జోడీగా ఆయన వైఫ్ జెనీలియా నటిస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఇందులో కీరోల్ లో కనిపిస్తున్నాడట. ఈ మూవీ డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలవుతుందని ఈ వెంట్ సందర్భంగా చిత్ర యూనిట్ తెలిపింది.