నటనకు సాయి పల్లవి గుబ్ బై.. కారణం అదే అంటూ వైరల్

0
885

సినీ ఇండస్ర్టీలో పక్కింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. డ్యాన్స్ షో నుంచి అంచలంచలుగా ఎదుగుతూ చిత్రసీమపై పాదం మోపింది ఈ ముద్దుగుమ్మ. అద్భుతమైన నృత్యం, సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సాయి పల్లవి. గ్లామర్ షోలు, ఎక్స్ పోజింగ్ కు పోకుండా మంచి పాత్రలు ఉన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ర్టీలో సక్సెస్ సాధిస్తూ వస్తుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ‘ఫిదా’తో అవణ్ తేజ్ జోడీగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టింది ఈ హీరోయిన్. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

వరుస ప్రాజెక్టులకు నో

టాలీవుడే కాకుండా కోలీవుడ్, శాండల్ వుడ్ తదితర చిత్ర పరిశ్రమలలో సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఇటీవల ఆమె నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’, న్యాచురల్ స్టార్ నానీతో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్ సాధించాయి. తర్వాతి సంవత్సరం రాణాతో కలిసి ‘విరాట పర్వం’లో నటించింది. అయితే ఇది కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. కానీ అందులో సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సినిమాలో ఆమె కీరోల్ ప్లే చేసిందనే చెప్పాలి. తర్వాత వచ్చిన చిత్రం ‘గార్గి’. యువతులపై జరుగుతున్న లైంగికదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి.

ఇండస్ర్టీని వదిలేస్తుందా

ఈ సినిమాల తర్వాత ఆమె ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదట. ఇక మీదట చెప్పరని కూడా ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది. పక్కింటి అమ్మాయిగా, న్యాచురల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవికి విపరీతంగా ప్రాజెక్టులు వస్తున్నాయట. అయినా కూడా ఆమె ఓకే చెప్పడం లేదట. దీంతో ఆమె సినీ ఇండస్ర్టీని వదిలేస్తున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆమె యాక్టింగ్ చేయరని, తన నటనా కెరీక్ ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి.

హాస్పిటల్ పెట్టాలని

సాయి పల్లవి జార్జియాలో మెడిసన్ పూర్తి చేసింది. నృత్యంపై విపరీతమైన ఇష్టం ఉన్న ఆమె ఒక డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరను అలరించింది. తర్వాత వరుసగా వస్తున్న సినిమా ఆఫర్లను చేస్తూ వెళ్లింది. కానీ ఆమెకు వైద్య వృత్తిపై ఎనలేని అభిమానం ఉందట. పేదలకు సేవ చేయాలనే సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసిందట. కానీ వరుస ఆఫర్లతో ఆమె బిజీగా ఉంటుండడంతో తన వైద్య ప్రొఫెసన్ ను పక్కన బెడుతూనే వస్తున్నారు. ఇప్పుడు పేదలకు సేవ చేసేందుకే వెళ్తానంటుంది సాయి పల్లవి.

తన చెల్లెలితో కలిసి పేదలకు సేవ చేయాలని

సాయి పల్లవి పుట్టిన ఊరు కోయంబత్తూర్. అక్కడ ఒక హాస్పిటల్ ప్రారంభించాలని ఆమె సంకల్పించారట. తన చెల్లెలు పూజతో కలిసి ఆ హాస్పిటల్ చూసుకోవాలని ఆమె అనుకుంటున్నారట. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు నిర్ణయించుకుందట సాయి పల్లవి. ఈ నిర్ణయంతోనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటుందని ఇండస్ర్టీలో విపరీతంగా టాక్ వినిపిస్తుంది. ఈ విషయాలపై ఇప్పటి వరకూ సాయి పల్లవి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ర్టీలో వస్తున్న వార్తలపై ఆమె ఏం చెబుతుందో అని ఆమె అభిమానులు నెటిజన్లు ఎదురు చూస్తున్నారు.