డిస్ర్టిబ్యూషన్ రంగంలోని ‘మైత్రీ’.. ఇంతకీ వారి ప్లాన్ ఏంటి..?

0
312

టాలీవుడ్ ఇండస్ర్టీలో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న ప్రొడెక్షన్ హౌజ్ ‘మైత్రీ మూవీ మేకర్స్’. సంచలనాలకు ఈ బ్యానర్ కేరాఫ్ గా నిలుస్తుంది. భారీ చిత్రాలను నిర్మించడం. అవి అంచనాలకు మించి ఆడుతుండడం సంస్థకు భారీగానే లాభాలు చేకూరుతున్నారు. ఈ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ స్టర్ అబ్బవరం కిరణ్ వరకూ అందరితో సినిమాలు నిర్మిస్తుంది. ఇటీవల ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో రెండు సినిమాలను సంక్రాంతి-2023కు విడుదల చేయబోతోంది. అది ఒకటి మెగాస్టార్ నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, రెండో బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’ ఒకటి 12తేదీ మరోటి 13వ తేదీన విడుదల చేయబోతోంది ఈ బ్యానర్.

రెండు టాప్ మూవీస్ రిలీజ్

బాబీ డైరెక్షన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ భారీ స్థాయిలో ఉండాలని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు పెద్ద హీరోలు ఒకే బ్యానర్ పై రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ అవుతుండడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’కి మలినేని గోపీచంద్ డైరెక్షన్ వహించారు. ఇక ఈ బ్యానర్ పై వచ్చిన ‘పుష్ప’ పాన్ వరల్డ్ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇది ఈ రోజు (డిసెంబర్ 8న) రష్యన్ లాంగ్వేజ్ లో ఆ దేశంలో విడుదలైంది.

వరుస ప్రాజెక్టులతో బీజీ

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ చాలా చిత్రాలకు కమిట్ అయ్యింది. ఇప్పటికే ‘పుష్ప2’ సెట్స్ మీదకు తీసుకస్తుండగా. మరి కొంత మంది స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ హరీశ్ శంకర్ తీసే చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మరి కొంత మందికి కూడా అడ్వాన్స్ లు ఇచ్చినట్లు ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది.

నైజాంలో ఆఫీస్ ప్రారంభం

అయితే ఇంత బిజీగా ఉన్న ఈ బ్యానర్ కొత్తగా డిస్ర్టిబ్యూషన్ రంగంలోకి వెళ్లనున్నారు. వీరి నిర్ణయంతో చిత్ర వర్గాలను ఆసక్తి నెలకొంది. దీని కోసం ఇటీవల వారు హైదరాబాద్ లో ఆఫీస్ కూడా తెరిచినట్లు టాక్. ఇక రానున్న కాలంలో ఈ మూవీ మేకర్స్ డిస్ర్టిబ్యూషన్ లో భారీ చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నైజాం ఏరియాకు సంబంధించి డిస్ర్టిబ్యూషన్ రంగంలో కొన్నేళ్లుగా దిల్ రాజు, ఏషియన్ సునీల్ హవా కొనసాగుతూ వస్తోంది. వరంగల్ శ్రీను కూడా వీరిపై పెద్దగా ప్రభావం చూపలేదు.

మైత్రీకి చాలా మంది ప్రొడ్యూసర్స్

ఈ నేపథ్యంలో ఇప్పుడు మైత్రీ రావడం తీవ్ర చర్చలకు తావిస్తోంది. అయితే డిస్ర్టిబ్యూటర్ల చేతిలో ప్రముఖంగా థియేటర్లు ఉండాలి. ప్రస్తుతం థియేటర్లన్నీ దిల్ రాజు, సునీల్ చేతిలో ఉన్నాయి. అసలు వీరు ఏ ధైర్యంతో ఇందులోకి అడుగుపెడుతున్నారన్న ప్రశ్నలు ఇండస్ర్టీలో వినిపిస్తున్నాయి. మైత్రీకి చాలా మంది ప్రొడ్యూసర్స్ మద్దతిస్తున్నట్లు కూడా టాక్ ఉంది. ఈ రంగంలో కూడా వారు రాణిస్తారని సీనీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.