ఆ యంగ్ డైరెక్టర్ కు ఇండస్ర్టీలో నో ఎంట్రీ బోర్డ్..?! ఇండస్ర్టీలో జోరుగా చర్చ

0
302

ఇండస్ర్టీలో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసిన ఎంతో మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్స్ కూడా కనుమరుగయ్యారు. ప్రతీ వారం.. ప్రతీ ఒక్కరి జాతకాన్ని ఇండస్ర్టీ మార్చి వేస్తుంది. సక్సెస్ అయిన వాళ్లే ఇండస్ర్టీలో ఉంటారు.. మిగతా వారు తెర మరుగు కావాల్సిందే.. ఇందులో ఎవరూ తోపులు కాదు. కాస్త నిలదొక్కుకున్న వారైతే మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ చిన్న వారు మాత్రం తెరమరుగవడం ఖాయం. ఈ కోవలోకే ఇటీవలే ఓ యంగ్ డైరెక్టర్ చేరాడనే టాక్ చిత్ర వర్గాల్లో విపరీతంగా వినిపిస్తోంది.

ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్.. సెకండ్ డిజాస్టర్

ఓ యంగ్ డైరెక్టర్ తన మొదటి సినిమాతో టాలీవుడ్ లో సంచలనాలను క్రియేట్ చేశాడు. యూట్యూబ్ మూవీస్ తీసుకునే ఆయనను ఓ స్టార్ డైరెక్టర్ సొంత బ్యానర్ పై ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆయన తీసిన సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఆయన దర్శకత్వంలో చేయాలని సీనియర్ హీరోలు కూడా అన్న సందర్బాలూ లేకపోలేదు. అయితే రీసెంట్ గా ఇండస్ర్టీ మాత్రం ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టిందని వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. అవకాశాలు ఇస్తానన్న వారు కూడా ఆ యంగ్ డైరెక్టర్ ను పట్టించుకోవడం లేదట.

గత చిత్రం మాదిరిగానే

గతేడాది ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీని కేవలం రూ. 4 కోట్లతో నే తెరకెక్కించాడు దర్శకుడు. కానీ ఆ మూవీ రూ. 75 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో ఇండస్ర్టీ అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతగా గుర్తింపు లేని స్టార్స్ తో కూడా అంత భారీ హిట్, పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టడం, అందునా కొత్త డైరెక్టర్ అంటూ ఇండస్ర్టీ అంతా నోరెళ్ల బెట్టింది.

ఇటీవల మూవీ డిజాస్టర్

అయితే ఇటీవల ఆ యంగ్ డైరెక్టరే తీసిన ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది. ఒక మూవీలో వర్కవుట్ అయిన కామెడీ తన రెండో మూవీలో కూడా వర్కవుట్ అవుతుందనుకున్న దర్శకుడిని తీవ్రంగా నిరాశపరిచింది. అందునా ఆ హీరోకు తమిళ్, తెలుగు ఇండస్ర్టీలో మంచి గుర్తింపు ఉంది. అంతటి హీరో ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ ఆయన అభిమానులు ఫైర్ అయ్యారు. రీసెంట్ గా ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది.

ఈ మూవీ డిజాస్టర్

క్రేజీ హీరో.. పేరున్న బ్యానర్ పై వచ్చినా కథలో కంటెంట్ లేకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రీవియస్ తరహాలోనే ఇందులో కూడా దర్శకుడు కామెడీ ట్రై చేశాడు. దీంతో రెండు ఇండస్ర్టీల్లో ప్లాప్ ను ఎదుర్కొంది. ఈ మూవీ దెబ్బకు తనతో సినిమాలు చేయాలని కోరుకున్న వారంతా మొహం చాటేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తర్వాతి మూవీనైనా కొత్త పంథాలో తెరకెక్కించాలని నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.