బాగాలేకపోయినా వెబ్ సైట్ లు అన్ని డప్పు కొట్టేది అందుకే

0
4477

బీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం. ఈ సినిమా కి దాదాపుగా అన్ని వెబ్ సైట్ లు మంచి రేటింగ్ ఇచ్చి ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. సినిమాలో ఏ మాత్రం కథగానీ, ఆసక్తి గానీ, కామెడీ గానీ లేకపోయినా ఇలా ఎందుకు రాస్తున్నారు? అనే అనుమానం రాక తప్పదు. ఇక పవన్ అభిమానులకు కూడా సినిమా నచ్చక పోయినా బయటికి వచ్చి బాగుందని చెబుతున్నారు.

యాడ్స్ రావేమో అని వెబ్ సైట్ ల భయం

ఎందుకంటే.. బాగాలేదు అని చెబితే కలెక్షన్ లు ఎక్కడ తగ్గుతాయోగాని వారి భయం. అందులో వారి తప్పు ఏమి లేకపోవచ్చు. కానీ వెబ్ సైట్ లు మంచి రేటింగ్ ఇచ్చి ఎందుకు పొగుడుతున్నాయో ఎవరికీ అర్ధం కాని విషయం. అందులో వారి భయం కూడా ఉంది. రేటింగ్ బాగా ఇవ్వక పోతే వారి వెబ్ సైట్ లకు పెద్ద సినిమా ల నుండి యాడ్స్ రావేమో అని భయం.

సినిమా హిట్ అని భ్రమ పడవచ్చు కూడా

అంతే కాక సినీ ఇండస్ట్రీలో వారికి బాగానే పరిచయాలు ఉన్నాయి. అందుకని రేటింగ్ తక్కువ ఇస్తే మరో సారి వారిని దగ్గరకు రానివ్వరని భయం ఉండవచ్చు. కానీ తీరా సినిమా చూసాక వెబ్ సైట్ లు రాసిన దానికి.. సినిమా ఉన్న దానికి ఎక్కడా పొంతన లేదు. అయితే కలెక్షన్ బాగా వస్తుందని కొందరు సినిమా హిట్ అని భ్రమ పడవచ్చు కూడా.

100 కోట్లు అనేది చాలా కామన్

అభిమానులకు, వెబ్ సైట్ లు సినిమా బాగుందని డప్పు కొట్టినా, సాధారణ ప్రేక్షకుడు మాత్రం ‘టికెట్ డబ్బులు బొక్క’ అని తిట్టుకుంటూ బయటకు వస్తున్నాడు. కలెక్షన్ పరంగా చూస్తే పవన్ సినిమాకి 100 కోట్లు రావడం పెద్ద విషయం కాదు. టాలీవుడ్ లో ఏ పెద్ద స్టార్ కి కూడా 100 కోట్లు తొలి రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తాయి. అలా బీమ్లా నాయక్ కి రావడంలో వింత ఏమి కాదు. కలెక్షన్ లు బాగా వచ్చాయని సినిమా సూపర్ హిట్ అనుకోవడం భ్రమే అవుతుంది మరి.