మహేశ్ బాబు జాతకం వల్లే తల్లిదండ్రులు చనిపోయారు

0
304

‘రాజకుమారుడు’తో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేశ్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి బాల్యంలో నటించినా రాజకుమారుడు మాత్రం ఆయన హీరోగా వచ్చిన మొదటి చిత్రం. ఆ తర్వాత మురారి, ఒక్కడు, పోకిరీ ఇలా చాలా సినిమాల్లో నటించి బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టారు. ఈ ఏడాది (2022) మహేశ్ బాబు ఫ్యామిలీలో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషాదాలకు కారణం మహేశ్ బాబు జాతకమే అంటూ సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంచలన కామెంట్లు చేసిన వేణు స్వామి

జ్యోతిష్యుడు వేణు స్వామి ఏ విషయం చెప్పినా అది సంచలనంగా మారుతుంది. గతంలో నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుంటారని వారి జాతకంలో ఉందని చెప్పారు. అది నిజం కావడంతో ఆయన జ్యోతిష్యం సోషల్ మీడియాలో బాగా హైప్ అయ్యింది. ఇటీవలి కాలంలో నయనతార విషయంలో కూడా ఇవే విషయాలు వెల్లడించారు. కానీ అది అయ్యేందుకు మరికొంత కాలం కావాల్సి వస్తుందని చెప్పారు. ఈయన జ్యోతిష్యాన్ని అందరూ నమ్మడం మొదలు పెట్టారు.

ఘట్టమనేని ఫ్యామిలీతో వేణు స్వామి

వేణు స్వామికి ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉండేది. పద్మాలయ స్టూడియోలో పూజలకు ఎక్కువగా వేణు స్వామే హాజరయ్యేవారట. 2017లో జరిగిన వినాయక చవితి పూజకు వేణు స్వామి వెళ్లారట. ఆ సందర్భంలో విజయ నిర్మల ఆయనను తమ కుటుంబ సభ్యుల జాతకం చెప్పమని అడిగిందట. 2020 నుంచి మీ ఇంట్లో వరుస మరణాలు జరుగుతాయని ఆయన అప్పుడే చెప్పాడట. ఆయన ఆ విషయం చెప్పినప్పటి నుంచి విజయ నిర్మల ఆయనను పూజలకు పిలవడం మానేసిందట. కానీ విజయ నిర్మల మాత్రం 2019లో మరణించారు.

వరుస మరణాలు

ఘట్టమనేని కృష్ణ ఇంట్లో ఈ యేడాది వరస మరణాలు సంభవించాయి. మొదట కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే మహేశ్ బాబు తల్లి ఇందిర కూడా కన్ను మూసింది. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఇలా వరుస మరణాలకు కారణం మహేశ్ బాబు జాతకమే అంటూ చెప్పారు.

మహేశ్ బాబు జాతకం చెప్పిన వేణు స్వామి

మహేశ్ బాబు జాతకం గురించి ఆయన వివరించారు. మహేశ్ జాతకం ప్రకారం.. శని, గురు స్థానాలు మారుతుండడం వల్ల ఆ గ్రహాల ప్రభావంతో తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్పారు. పైగా మహేశ్ బాబుది సింహ రాశి కాబట్టి ఆయన జాతక రీత్యా ఆయన తల్లిదండ్రులు తక్కువ వ్యవధిలోనే చనిపోతారు. అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.