ఆమెతోనే ప్రదీప్ ఏడడుగులు.. బ్యాచ్‌లర్ లైఫ్ కు ఫుల్ స్టాప్

0
298

తెలుగు మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు గురించి తెలియని వారు ఉండరంటే సందేహం లేదు. ఎలాంటి షో అయినా, ఈవెంట్ అయినా ఆయన మేల్ యాంకర్ ప్లేస్ లో ఉండాల్సిందే. యాంకర్లలో ఆయనకు ఒక డిఫరెంట్ ఫాలోవర్స్ ఉన్నారంటే సందేహం లేదు. సుడిగాలి సుధీర్, ఆది, రష్మీ, అనసూయ ఇలా ఎంతో మందితో కో యాంకర్ చేసి నవ్వులు పూయించడంలో ఆయన స్టయిలే వేరని చెప్పాలి. ముఖ్యంగా మాచిరాజు కామెడీ టైమింగ్స్ కు ఫిదా అవ్వాల్సిందే.

టీవీ షోలు, ఈవెంట్లలో బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా ఎంట్రీ ఇస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు ప్రదీప్. ఇటీవల ఆయన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’తో హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రదీప్ కు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అయిన ఆయనపై వివాహం విషయంలో చాలా రూమర్లు వస్తూనే ఉన్నాయి.

పెళ్లిపీటలు ఎక్కబోతున్న ప్రదీప్

పెళ్లి రూమర్స్ తో తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రదీప్ మాచిరాజు. ఈ నేపథ్యంలో మరో సారి కూడా ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. చాలా సార్లు వీటిని ఖండించిన ఆయన ఈ సారి మాత్రం పెళ్లి పీటలు ఎక్కబోతున్నది నిజమనే తెలుస్తోంది. దీనికి తోడు ఆయన చేసుకునే అమ్మాయి పొటోలు, వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమె ఎవరో కాదు ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతుగా తెలుస్తుంది. ఈ నవ్యనే ప్రదీప్ కు క్యాస్టూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తుంది. వృత్తి పరంగా ఇద్దరూ ట్రావెల్ చేస్తున్న సమయంలో వీరి మధ్య ప్రేమ పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.

నవ్యతోనే ప్రదీప్ పెళ్లి

నవ్య, ప్రదీప్ కొన్ని రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లు బుల్లితెర ఇండస్ర్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి లవ్, రిలేషన్ కు ఇరువైపులా కుటుంబ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక పెళ్లి తంతు మాత్రమే బాకీ ఉందని, అది కూడా త్వరలోనే అంటూ లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లి విషయమై ఇరు కుటుంబాల పెద్దల మధ్య మాటలు కొనసాగుతున్నాయట.

త్వరలోనే ఈ విషయంపై ప్రదీప్ పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. నవ్యకు ఇండస్ర్టీలో మంచి గుర్తింపు ఉంది. అనేక మంది ఆర్టిస్టులకు, సెలబ్రెటీలకు ఆమె కాస్టూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు.

పెళ్లిపై నెటిజన్ల కామెంట్లు

ప్రతీ సారీ పెళ్లి వార్తల గాసిప్ లతో వార్తల్లోకి ఎక్కిన మాచిరాజు ఈ సారి తన లవర్ మెడలో తాళి కట్టేస్తున్నాడని కో యాంకర్లతో పాటు నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కావాలని, బ్యాచ్‌లర్ లైఫ్ కు స్వస్తి పలకాలని కామెంట్లు చేస్తున్నారు.