‘హిట్ 3’ కూడా ఫిక్స్, ‘హిట్ 2’లో అదే ట్విస్ట్, హీరోపై నాని హింట్

0
232

నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ‘హిట్2’. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ పై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. ఈ మూవీ ఎండ్ లో ఒక ట్విస్ట్ ఉందట. హిట్ 3 కూడా ఉండబోతోందని తెలుస్తుంది. హిట్ 3లో హీరో ఎవరనేది హింట్ కూడా ఇచ్చాడట నాని.

అందరిలో ఆసక్తి

ప్రస్తుతం వెబ్ సిరీస్ తరహాలోనే సినిమాలకు కూడా సీక్వెల్స్ వస్తున్నాయి. ఒక మూవీ చివరలో ట్విస్ట్ తో ముగించిన దర్శకులు మరో కథను దానికి యాడ్ చేసి సీక్వెల్ గా విడుదల చేస్తుంటారు. ఇది హాలివుడ్ లో ఎక్కువగా జరుగుతుండగా ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్ చిత్ర సీమ ఏదైనా మన ఇండియన్ ఇండస్ర్టీని మొత్తం సీక్వెల్ తో నిండిపోయింది. హిట్ ఒక ఫ్రాంచైజీగా రాబోతున్నట్లు ప్రొడ్యూసర్ నాని, డైరెక్టర్ శైలేశ్ ప్రకటించారు. వీరి ప్రకటనతో అందరిలో ఆసక్తి పెరిగింది. ‘హిట్’తో విజయం సొంతం చేసుకున్న డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వంలోనే ‘హిట్ 2’ రాబోతోంది.

రాజమౌళి ప్రశంసలు

ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ‘హిట్ 2’ మూవీకి సంబంధించి సోమవారం ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు. ట్రైలర్ గురించి ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే ఇక మూవీ ఏ రేంజ్ ఉండబోతోందో అర్థం అవుతుందని చెప్పారు ఆయన. హీరో మనకు తెరమీద కనిపించినా విలన్ ఎవరనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందన్నారు. ప్రొడక్షన్ విషయంలో నాని ఒకడుగు ముందుకేయడం ఆనందించదగిన విషయం అన్నారు.

నాని ఆసక్తికర విషయాలు

హిట్ ఫ్రాంచైజీ ఆలోచన గొప్పదన్నారు. అందకు నానితో పాటు డైరెక్టర్ ను కూడా అభినందనలతో ముంచెత్తాడు రాజమౌళి. ప్రతీ ఏడాదిలో ఒక ‘హిట్’తో ముందుకు రావాలని అది ఆ సినిమా సీజన్ కావాలని ఆయన ఆకాంక్షించారు. సోమవారం (నవంబర్ 28న) జరిగిన ప్రీ ఈవెంట్ లో నాని సినిమా, ఫ్రాంచైజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హిట్ 3కి సంబంధించి ఒక హింట్ కూడా ఇచ్చాడు.

ఈ సినిమా క్లైమాక్స్ లో హిట్ 3కి ఎవరు హీరో అనే విషయం కూడా ప్రేక్షకులకు రివీల్ అవుతుందని చెప్పారు. దాదాపు ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకూ హాలీవుడ్ లో కూడా లేదని చిత్ర విశేషాలు చెప్పారు నాని.

హిట్ 3లో విజయ్ సేతుపతి..!

హిట్ 3లో హీరోగా విజయ్ సేతుపతి ఉండబోతున్నారని టాక్ వినిపిస్తుందని ప్రేక్షకులు అనగా, ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని, హిట్ 3 కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందని చెప్పారు నాని. ‘హిట్ 2’ కథ పరంగా క్లైమాక్స్ ముగిసే నాటికి తదుపరి చిత్రం ‘హిట్ 3’ కి దాదాపు హీరో ఎవరనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అయితే ‘హిట్ 3’లో కూడా అడవి శేషు కీరోల్ ప్లే చేస్తాడని ఈ వెంట్ లో స్పష్టం చేశారు.

‘హిట్ 2’లోని కేడీ పాత్రకు కొనసాగింపుగానే ‘హిట్ 2’లో శేషు పాత్ర ఉంటుందని లీక్ ఇచ్చారు. ఇందులో నాని కూడా యాక్ట్ చేయబోతున్నారట. విలన్ గానా..? లేక గెస్ట్ రోలా..? అనేది సస్పెన్స్ లో ఉంచారు.

హిట్: ద సెకండ్ కేస్

తర్వాతి సీజన్ లో వచ్చే ‘హిట్ 4’కు హీరోగా నాని వస్తాడా.. అంటూ అప్పుడే చర్చలు కూడా మొదలయ్యాయి. ‘హిట్ 3’ అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని చెప్పారు. మర్డర్ మిస్టరీ ఛేదించేందుకు తీసిన ‘హిట్: ద సెకండ్ కేస్’లో అడవి శేషు హీరోగా హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇది డిసెంబర్ 2 న థియేటికల్ రిలీజ్ చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత హిందీలోకి డబ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.