అల్లు అరవింద్ తో అందుకే విభేదాలు

0
464

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ ఇద్దరికీ పరిచయం అవసరం లేదు. ఒకరు రికార్డులకు బాస్ అయితే మరొకరు ఇండస్ట్రీకే బిగ్ ప్రొడ్యూసర్. వీరు వరుసకు బావా, బావమరుదులు. చిరంజీవిలోని నటనను మెచ్చిన అల్లు రామలింగయ్య తన కూతురును ఇచ్చి వివాహం చేసి అల్లుడిగా తెచ్చుకున్నాడు. బావ ఇండస్ట్రీలో మరింత నిలదొక్కుకునేందుకు అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ తోడ్పాడు అందించారు.

ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రస్తుతం గాసిప్ లు ఉన్నాయి. అందుకే అల్లు అరవింద్ బావను పక్కనపెట్టి బాలకృష్ణతో క్లోజ్ గా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇందులో కొన్ని విషయాలను చిరంజీవి బాలకృష్ణతో పంచుకున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

విభేదాలు ఉన్నాయన్న వార్తలు చెక్కర్లు

మెగాస్టార్ నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ 13న (శుక్రవారం) విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన చిరంజీవి ఎన్నో విషయాలను పంచుకున్నారు. చిరంజీవి కుటుంబానికి అల్లు వారి కుటుంబానికి విభేదాలు ఉన్నాయన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అందుకే మెగా ట్యాగ్ తగిలించుకునేందుకు అల్లు అర్జున్ ఏ మాత్రం ఇష్టపడడం లేదని వినిపిస్తోంది. వీరి కుటుంబాల్లో గొడవలపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.

నవ్వుకుంటూ వెళ్లిపోతారు

చిరంజీవి ఇప్పటి వరకూ ఎవరితోనూ విభేదాలు పెట్టుకున్న సందర్భం ఇండస్ట్రీ నుంచి సాధారణ సినీ ప్రేక్షకుడి వరకూ చూసింది లేదు. సభలు, సమావేశాలు, ఈవెంట్లలో ఆయనపై ఎవరైనా సెటైర్లు వేసినా ఫైర్ అయినా నవ్వుకుంటూ వెళ్లిపోతారు. లేదా సర్ది చెప్తారు. వీభేదాలకు దూరంగా ఉండేందుకే చిరంజీవి ఇష్టపడతారు.

ఇది సాధారణమే

అయితే కుటుంబం విషయానికి వస్తే తన బావమరిది అల్లు అరవింద్ తో కొంత గ్యాప్ వచ్చిందని, కొన్ని విభేదాలు నడుస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఇలాంటి వార్తలు మాకు కొత్తకాదు. ఇది సాధారణమే చాలా సార్లు ఇలాంటి వార్తలు ఇండస్ట్రీలో స్ర్పెడ్ అయ్యాయి. కానీ అల్లుకు నాకు ఎలాంటి గొడవలు లేవు. ఇప్పటి వరకూ విభేదాలు కూడా లేవు.

మా ఇంటికి వచ్చి క్రిస్మస్

ఎప్పుడూ కలిసి ఉండాలనే అనుకుంటాం. అల్లు అరవింద్ బర్త్ డేను అందరం కలిసే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు చిరంజీవి. కుటుంబం అంతా సందడిగా గడుపుతాం. ఈ మధ్య క్రిస్మస్ వేడుకల గురించి అనుకుంటా ఒక దగ్గర జరుపుకోలేదు కాబట్టి గొడవలు అంటూ వార్తలు వినిపించాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులే తప్ప విభేదాలు కాదు. అల్లు అర్జున్ మా ఇంటికి వచ్చి ఇక్కడే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

అందరం సంతోషంగా ఉండాలి

ఆహాలో బాలయ్య బాబుతో అల్లు అరవింద్ అన్ స్టాపబుల్ చేయించే కారణాలను కూడా చిరంజీవి వివరించారు. మొదటి ఆ షో తనను చేయమన్నారు. కానీ నేను అప్పుడు చాలా బిజీగా ఉండడంతో చేయలేకపోయాను. అయినా బాలకృష్ణ స్టయిల్ లో ఆ షో నాకు చాలా ఇష్టం. ఇలాగే ఆహా అన్నింట్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకోవాలి. అందరం సంతోషంగా ఉండాలి అంటూ చెప్పారు చిరంజీవి. అల్లు కుటుంబంతో విభేదాలతో పాటు బాలయ్యతో అల్లు అరవింద్ షోపై కూడా క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.