వీరసింహా రెడ్డిలో బాలయ్య నట విశ్వరూపం

0
1638

నటులు: యువరత్న నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, ఇతర తారాగణం.
మాటలు: సాయి మాధవ్ బర్రా
సినిమాటోగ్రఫీ: రిషీ పంజాబీ
ఎడిటర్ం నవీన్ నూలి
మ్యూజిక్: ఎస్ఎస్ తమన్
ప్రొడ్యూసర్స్: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి
దర్శకుడు: గోపీచంద్ మలినేని

రిలీజ్ : 12 జనవరి, 2023

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిపేందుకు మైత్రీ మూవీ మేకర్స్ గురువారం ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్, టీజర్, పోస్టర్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లాయి. ‘అఖండ’ లాంటి భారీ కమర్షియల్ తర్వాత వచ్చిన ‘వీరసింహా రెడ్డి’పై చిత్ర యూనిట్ బాగానే ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. సినిమా ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఏంటి అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

స్టోరీ

జై, అతని తల్లి, వీరితో పాటు సంధ్య టర్కీలో నివసిస్తుంటారు. అయితే వారితో తండ్రి మాత్రం ఉండడు. జై తన తండ్రిని ఎలాగైనా కలవాలని సంధ్య తండ్రి పట్టుబడతాడు. ఈ నేపథ్యంలో జై తండ్రి వీరసింహా రెడ్డి టర్కీకి వస్తాడు. అప్పుడే తన తండ్రిని జై మొదటి సారి చూస్తాడు. ఇక వీరసింహారెడ్డి టర్కీకి రావడంతో మొదలైన సమస్యలు వారిని వెన్నంటుతూనే ఉన్నాయి. అసలు వీరసింహారెడ్డి ఎవరు..? ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది. ప్రస్తుతం ఫ్యామిలీని విడిచిపెట్టి ఎందుకు ఉంటున్నాడు. ఇలంటి ఘట్టాలన్నీ సినిమాల్లో చూడాల్సిందే..

తారాగణం

మాస్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు ఈ సినిమాలో తన నటనను చూపి ఆకట్టుకున్నాడు. ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న బాలకృష్ణ తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు ఈ నేపథ్యంలోనే కొనసాగాయి. ఇటీవల ఇది కొంచెం తగ్గినా ఈ సినిమాతో మళ్లీ ముందకు వచ్చింది. ఈ సినిమా మొత్తం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. ఈ మూవీలో బాలకృష్ణ వన్ మ్యాన్ షో కనిపించింది. డబుల్ యాక్షన్ లో అద్భుతంగా రాణించారు బాలయ్య. ఇక గ్లామర్ గురించి మాట్లాడితే శృతీ హాసన్ బాగా సరిపోయింది. వరలక్ష్మీ శరత్ కుమార్ తన డైలాగ్స్ తో మరోసారి ఆకట్టుకుంది. దునియా విజయ్ బాలకృష్ణ కు ధీటుగా నటించాడు. విలనిజం ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మిగతా నటులు కూడా పాత్రకు తగ్గట్లుగా నటించి మెప్పించారు.

టెక్నీషియన్స్

క్రాక్ సినిమాతో కొంత ఇమేజ్ కోల్పోయిన దర్శకుడు గోపీచంద్ మలినేని అభిమానులకు ఆయన సరైన కథతో వీరసింహా రెడ్డి తీసి మెప్పును పొందారు. బాలయ్యకు సరిగ్గా సరిపోయే స్టోరీ లైన్ ను ఎన్నుకున్నారు గోపీచంద్. కథ, కథనం, స్ర్కీన్ ప్లే, డైరెక్టర్ అన్నీ బాగున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ కోసం అన్ని అంశాలను ఇందులో మేలవించారు దర్శకుడు. మాస్ డైరెక్టర్ కావడం, మాస్ హీరో ఇలా అన్ని అంశాలు కలిసి వచ్చాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ సాగింది.

ఎస్ఎస్ తమన్ నేపథ్య సంగీతం అదరగొట్టిందనే చెప్పాలి. జై బాలయ్య పాటకు ఈలలు, గోలలు థియేటర్ లో ధుమ్ము కనిపించిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని కొన్ని సీన్లకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇందుకు ఆయన సంగీతం ఆజ్యం పోసింది కూడా. కెమెరామన్ రుషీ పంజాబి. తన పనితనాన్ని పూర్తిగా చూపించాడు. ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాణ సంస్థ మైత్రీ కాబట్టి దేనికీ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. రిచ్ క్వాలిటీతో మూవీ ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్: యువరత్న బాలకృష్ణ హీరోగా చేయడమే.. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్, డైరెక్టర్ అన్నీ సరిపోయాయి.

మైనస్ పాయింట్: కొంచెం రొటీన్ గానే ఉంది. రన్ టైం కూడా ఎక్కువగా ఉంది.

ఫైనల్ గా: వీరసింహా రెడ్డి చూడదగ్గ చిత్రం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ చిత్రంలో బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ వేరే లెవల్ గా ఉంది. సీన్స్ అధిరిపోయాయి. బాలయ్య బాబు స్ర్కీన్ ప్రజెంటేషన్ అదరహో అనిపిస్తుంది.

రేటింగ్: 2. 75/5