విషమిచ్చి చంపాలనుకుంది అతడే: చిరంజీవి

0
616

చిరంజీవికి అభిమానులు ఎక్కువే. ఒక్కోసారి అభిమానులు తన అభిమాన హీరోపై ఉన్న ప్రేమతో చేసే పనులు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఇలాంటిదే చిరంజీవి జీవితంలో జరిగింది. ఆయనపై ఒకసారి విష ప్రయోగం జరిగిందట. ఆ విషయాలపై చెప్పుకచ్చారు ఆయన. అవేంటో తెలుసుకుందాం.

ఒంటరిగా వచ్చి మెగాస్టార్ గా మారిన చిరంజీవి

ఇండస్ట్రీలోకి ఒంటరిగా వచ్చారు చిరంజీవి. శివశంకర వర ప్రసాద్ గా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఆయనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. నటనపై ఉన్న పాషన్ తో వచ్చిన చిరంజీవి వచ్చిన ప్రతీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. వచ్చిన మొదట్లో చిన్నా, పెద్దా క్యారెక్టర్ల గురించి పట్టించుకోలేదు. ప్రతీ పాత్ర తనకు ఎంతో నటనను నేర్పుతుందని అనుకున్నారు.

దర్శకుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ మంచి క్రమ శిక్షణ ఉన్న నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు చిరంజీవి. ఆయనలోని ఈ క్రమ శిక్షణ నటనలో ఆయన తీరును చూసి ముచ్చటపడిన అల్లు రామలింగయ్య తన కూతురును ఇచ్చి అల్లుడిని చేసుకున్నారు. ఇక తర్వాత మనకు తెలిసిందే మెగాస్టార్ గా మారిన చిరంజీవి టాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో బాక్సాఫీస్ హిట్లు ఇచ్చారు.

కొనసాగుతున్న విజయపరంపర

చిరంజీవి 150కిపైగా చిత్రాల్లో నటించి, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13 (శుక్రవారం) విడుదల కాబోతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రమోషన్లను కూడా ముగించుకొని ఇక విడుదల ఒక్కటే బాకీగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి తనపై ఒక సారి విష ప్రమోగం జరిగిందని, కానీ తాను తప్పించుకున్నానని చెప్పాడు. ఇండస్ట్రీ మొత్తం ఈ మాటలతో షాక్ కు గురైంది. అయితే అది పిచ్చి అభిమానమే తప్ప కక్షలాంటివి కాదని చెప్పుకచ్చారు.

అప్పట్లో అభిమానులను నేరుగా కలిసే వారు

అప్పట్లో అభిమానులు నటుడిని కలవాలంటే పెద్దగా రిస్టక్షన్స్ ఉండేది కాదు. షూటింగ్ ల నుంచి బయటి ప్రదేశాలలో కూడా తన అభిమాన నటుడి వద్దకు వెళ్లేవారు. అప్పుడు సెల్ఫీలు కూడా ఉండేవి కాదు. మీడియా కూడా అంతగా విస్తరించకపోవడంతో ఒక హీరో ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడోనన్న విషయం ఎవరికీ తెలియదు. సాధారణంగా హీరో బయటకు వెళ్తే అక్కడ ఉన్న మామూలు వ్యక్తులు మాత్రమే కలిసే వారు. కానీ ఎక్కువగా క్రౌడ్ ఉండేది కాదు. సో హీరోలు కడా యథేచ్ఛగా తిరిగేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయనుకోండి. ఇదంతా పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం.

విష ప్రయోగం చేసింది అతడే

అప్పట్లో షూటింగ్ సమయంలో హీరో చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు ఫ్యాన్స్. చిరంజీవితో కేక్ కట్ చేయించారు. చిరంజీవికి కేక్ చేత్తో కాకుండా స్పూన్ తో తినే అలవాటు ఉండేదట. కానీ చెప్పినా వినకుండా ఒక అభిమాని తన నోట్లో కేక్ కుక్కేశారట. చేదుగా ఉండడంతో ఒక్కసారిగా ఉమ్మేశారు చిరంజీవి. కేక్ లో ఏదో పౌడర్ ఉందని క్లారిటీ వచ్చిందట. వెంటనే అతన్ని తోటి అభిమానులు పట్టుకొని కొట్టడంతో అసలు విషయం బయటపెట్టారట.

అభిమానం పీక్స్ కు వెళ్లింది

తనకు కేక్ పెట్టిన వ్యక్తి కూడా తన అభిమానే. అంతే కాదు ఆయన అభిమాన సంఘానికి అధ్యక్షుడు కూడా. చాలా రోజుల నుంచి తను ఆయనను పట్టించుకోవడం లేదని కేరళ వెళ్లి వశీకరణ పౌడర్ తీసుకచ్చి తనపై ప్రయోగించాలని అనుకున్నాడట. ఒక్కొక్కప్పుడు అభిమానం ఇంత పీక్స్ కు కూడా వెళ్తుందని ఆ ఘటన చూస్తేనే నాకు అర్థమైంది. అతన్ని ఏమీ అనకుండా వదిలేశాను. అంటూ చిరంజీవి చెప్పుకచ్చారు. తనపై విష ప్రమోగం జరిగిన ఘటనపై ఆయన క్లారిటీ ఇచ్చారు.