ఈ స్టార్స్ వెండితెరకు రాకముందు టెలివిజన్ లలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో తెలుసా

0
340

లైఫ్ లో సక్సెస్ దక్కాలంటే నిత్యం శ్రమిస్తూనే ఉండాలి. సక్సెస్ అనేది జర్నీ లాంటిది ఒక చోటే ఆగిపోతే జీవ మనుగడ సాధ్యం కాదు. ఏదో సాధించాలనే తపనే మానవ జాతిని జీవ కోటి నుంచి వేరు చేసి ప్రత్యేకంగా నిలిపింది. ఇక్కడ కొందరు స్టార్ల గురించి తెలుసుకుందాం.. బుల్లితెర నుంచి వచ్చిన వీరు వెండితెరపై అగ్ర కథా నాయకులుగా ఎదిగారు. ఇప్పుడు వీరు సిల్వర్ స్క్రీన్ ను ఏలుతున్నారు. వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేజీఎఫ్ హీరో యష్

బహుషా దేశంలోనే ‘కేజీఎఫ్’ సీక్వెల్ గురించి తెలియని సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇందులో హీరోగా అద్భుతమైన ఫర్మార్మెన్స్ చేసిన యష్ తన నటనా కెరియర్ ను బుల్లితెర నుంచి స్టార్ట్ చేశాడంటే నమ్మలేం కదా.. నటుడు అవ్వాలన్న ఆయనకు బలమైన కోరిక ఉండేదట. టీనేజ్ లోనే ఆయన ఇంటి నుంచి పారిపోయాడంట. తర్వాత ఆర్టిస్ట్ గా శిక్షణ తీసుకున్నాడు. ‘నంద గోకుల’లో మొదటి సారిగి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు యష్. తర్వాత సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. వెంట వెంటనే ఆఫర్లు వచ్చి కేజీఎఫ్ వరకూ ఆయన ప్రస్థానం కొనసాగింది.

సీరియల్స్ తో విపరీతమైన ఫేమ్

సీతా రామం ఈ ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె కెరీర్ బుల్లితెరపైనే స్టార్ట్ అయ్యింది. 2012లో ఆమె బుల్లితెరపై అరంగేట్రం చేశారు. ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ లో నటించి ఆకట్టుకుంది. ఈ సీరియల్స్ తో ఆమెకు విపరీతమైన ఫేమ్ వచ్చింది. దానితో వెండితెర ఛాన్స్ లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లాయి. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమనుల్లో నయనతార ఒకరు. ఆమె కూడా బుల్లితెరతోనే అరంగేట్రం చేశారు. తన కెరీర్ బిగినింగ్ లో టీవీ ప్రజెంటర్ గా పని చేశారు.

కీర్తి సురేశ్ మొదట బుల్లితెరకు

ఆమె లైఫ్ స్టయిల్ కు సంబంధించి కొన్ని ప్రొడక్టులను ప్రజెంట్ చేసేదిగా యాడ్ షూట్ లలో నటించారు. 2003లో మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు నయనతార. కీర్తి సురేశ్ నటనా ప్రయాణం చిన్నతనం నుంచే ప్రారంభమైంది. ఆమె తల్లి మేనక హీరోయిన్ కాగా, తండ్రి సురేశ్ డైరెక్టర్. వారి పరిచయాలతోనే కీర్తి సురేశ్ మొదట బుల్లితెరకు వచ్చారు. తర్వాత వెండితెర స్టార్ గా ఎదిగారు. ఆమె నటించిన ‘మహానటి’ ఆమె కెరీర్ లో ఇప్పటి వరకూ బిగ్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఆమె ప్రస్థానం టెలివిజన్ లో ఒక డ్యాన్స్ షోతో ప్రారంభమైంది. ఢీ-4లో ఆమె కంటెస్టెంట్ గా చేసి తన డ్యాన్స్ తో మెప్పించారు.

హీరోయిన్ నజియా గ్రేట్ యాంకర్

నటనపై ఆమెకున్న మక్కువతో కష్టపడి హీరోయిన్ అయ్యారు. ఆమె నటించిన మొదటి చిత్రం ‘ప్రేమమ్’ సూపర్ డూపర్ హిట్టయింది. తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. హీరోయిన్ నజియా గ్రేట్ యాంకర్. టీనేజ్ లో ఆమె మలయాళ టెలివిజన్ లో ప్రసారం అయ్యే షోలో యాంకర్ గా పని చేశారు. తర్వాత సినిమా ఇండస్ర్టీ వైపు వచ్చారు. ‘అంటే సుందరానికి’ సినిమా రీసెంట్ గా రాగా అందులో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.