మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య బాబు క్లారిటీ.. ఆ సినిమాతోనే..?

0
1162

నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రంపై బాలక్రిష్ణ క్లారిటీ ఇచ్చారు. తన దర్శకత్వంలోనే ఎంట్రీ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. బాలక్రిష్ణ రీసెంట్ గా ఓ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ లో భాగంగా తనకు తన కెరీర్ లో ‘ఆదిత్య 369’ అద్భుతమైన సినిమా అని ఆ రేంజ్ లో మరో సినిమా తీయాలని అది కూడా తన దర్శకత్వంలోనే చేయాలని దాని పేరు కూడా దాదాపుగా ‘ఆదిత్య 999 మ్యాక్స్’గా పెట్టాలని అనుకుంటున్నాను అన్నాడు బాలక్రిష్ణ. దీంతో బాలయ్య బాబు అభిమానులు నందమూరి వారసుడు రాబోతున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

గోవా ఫలింఫెస్టివల్ లో

ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యత తనకు నమ్మకం ఉన్న దర్శకుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై బాలయ్య బాబు మాట్లాడుతూ అంతా దైవేచ్ఛ అంటూ దాట వేశారు. బాలక్రిష్ణ రీసెంట్ మూవీ ‘అఖండ’ గోవా ఫలిం ఫెస్ట్‌వల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. దీనిలో భాగంగా ఆయన గోవా వెళ్లాడు. అక్కడ ఆయనను విలేకరులు మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడు..? డైరెక్టర్ ఎవరు..? ఏ సినిమా..? అంటూ విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. మన చేతిలో ఏం లేదని ఎప్పుడు రావాలో దైవం చెప్పాలని అంతా దైవేచ్ఛ అంటూ చెప్పారు.

‘అఖండ’పై ప్రశంసలు

గోవాలో కొనసాగుతున్న 53వ అంతర్జాతీయ ఫలిం ఫెస్టివల్ లో ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్యకు సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇందులో ‘అఘోరా’గా బాలయ్య బాబు నటనకు భారీ ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం ప్రదర్శనను తిలకించేందుకు దర్శకుడు బోయపాటితో పాటు ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డితో కలసి బాలక్రిష్ణ వెళ్లారు. ఈ క్రమంలోనే బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీపై అప్ డేట్ ఇచ్చారు.

‘ఆదిత్య 999 మ్యాక్స్’ లో ఎంట్రీ లేనట్టేనా

మోక్షజ్ఞను ‘ఆదిత్య 369’ లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ ద్వారా పరిచయం చేయాలని ఆశిస్తున్నానని చెప్పారు బాలయ్య. దానికి కూడా తానే దర్శకత్వం వహిస్తానని దాని పేరు కూడా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అంటూ అనౌన్స్ చేశారు యువరత్న బాలక్రిష్ణ. కానీ బాలయ్య వరుస మూవీస్ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. గోపీచంద్ మలినేనితో కలిసి ‘వీరసింహారెడ్డి’ చేస్తున్నారు. తర్వాత అనిల్ రావిపూడి, బోయపాటితో మరో చిత్రం చేయబోతున్నారు. ఇందులో బోయపాటి ప్రాజెక్టుకు మోక్షజ్ఞను పరిచయం చేయనున్నట్లు ఇండస్ర్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బాలయ్య బాబుని ప్రశ్నించగా ‘అంతా దైవేచ్ఛ’ అంటూ నవ్వి ఊరుకున్నారు.

‘అఖండ-2’ వస్తుందా

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ బాక్సాఫీస్ హిట్ సాధించడంతో దీనికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ 2024లో ఎటక్షన్స్ ఉండడంతో రాజకీయ నేపథ్యంలో ఒక కథను ఎంపిక చేసుకొని సినిమా తీయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విధంగా 2014 ఎలక్షన్స్ ముందు ‘లెజెండ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య. దీనిపై అప్పట్లో రాజకీయ విమర్శలు వచ్చాయి. కానీ అది మాత్రం బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇదే విధంగా వచ్చే ఎన్నికల ముందు మరో సినిమా అదే డైరెక్టర్ (బోయపాటి శ్రీను)తో కలిసి చేయాలని చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే వేసవి సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.