భీమ్లా నాయక్ లీక్.. ఆందోళనలో అభిమానులు

0
1998

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా విడుదలై అభిమానుల్లో మంచి టాక్ తెచ్చుకుంటుంది. అభిమానులు సినిమా థియేటర్ ల కోలాహలం చేస్తున్నారు. సినిమా విడుదల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులకు పండగ లా అనిపిస్తుంది. పవన్ క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ట‌పాసులు పేల్చుతూ పండగ చేసుకుంటున్నారు.

తొలి రోజునే సినిమా లీక్

కాగా.. ఓకే పక్కన సినిమా విడుదల అయి ఆనందంగా ఉంటే, మరో పక్క ఓ వార్త అభిమానులను కలవర పెడుతుంది. ఈ సినిమా ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు అభిమానులు. విడుదల అయిన తొలి రోజునే ఈ సినిమా లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ కూడా ఆందోళనలో ఉన్నారు. తోలి రోజునే కొన్ని వెబ్ సైట్ లలో ఈ దర్శనం ఇస్తుంది. ఇది చిత్ర కలెక్షన్ లపై భారీగానే ప్రభావం చూసేలా కనిపిస్తుంది.

కొడాలి నానికి పవన్ అభిమానుల సెగ

ఇదిలా ఉండగా ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని లకు పవన్ అభిమానుల సెగ తగిలింది. గుడివాడలో ఓ సినిమా థియేటర్ ఓపెనింగ్ కి వచ్చిన వీరిని పవన్ అభిమానులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదర కొట్టారు. కొంత మంది పవన్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.