దానికి ఒప్పుకోలేదని నా కెరీర్ నాశనం చేసాడు

0
2659

స్నేహా ఉల్లాల్ గురించి కొందరికి తెలియక పోవచ్చు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఆమె. మస్కట్ లోని మిడిల్ ఈస్ట్ లో ఇండియన్స్ ఫ్యామిలీలో 18 డిసెంబర్, 1987లో పుట్టారు ఆమె. అక్కడే ఉన్న ఇండియన్ స్కూల్ వాడి కబీర్ లో విద్యను అభ్యసించింది. చిన్నప్పటి నుంచి నటనపై ఇంట్రస్ట్ ఉన్న ఆమె మెల్లమెల్లగా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. తన మొదటి సినిమా లక్కీ: నో టైం ఫర్ లవ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించింది.

ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉండడంతో ఇండస్ట్రీ అంతా జూనియర్ ఐశ్వర్యారాయ్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఉల్లాసంగా.. ఉత్సాహంగా చిత్రంలో నటించి మెప్పించింది. ఇక వరుసగా కొన్నాళ్లు సినిమాలు చేసింది. తర్వాత వెబ్ సీరియల్స్ కూడా చేస్తూ బ్రేక్ తీసుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకుంది.

స్నేహ ఉల్లాల్ పడిన కష్టాలు

చిత్ర సీమ అంటేనే రంగుల, మాయా లోకం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ముందుగా ఊహించ లేరు. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ లు కూడా ఒకరు, లేదా ఇద్దరు భార్యలున్న వారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వారి లైఫ్ వారిష్టం అనుకోండి. సినిమా లోకంలో ఎన్నో గాసిప్ లు వస్తుంటాయి. ఒక్కో సారి ఈ గాసిప్ లతో కెరీర్ కూడా ముగియవచ్చు.

వాటిని ఎదుర్కొనలేక డీప్రెషన్ ను ఎదుర్కొని తనువు చాలించిన వారు కూడా ఉన్నారు. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న వారు మాత్రం ఇప్పుడు టాప్ పొజీషన్ లో ఉన్నారనే చెప్పాలి. దీంతో పాటు ఇండస్ట్రీ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పై వివాదాలను ఎదుర్కొంటుంది. జూనియర్ ఐశ్వర్య కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొందట. అవేంటో చూద్దాం..

కెరీర్ లో పడిన బ్రేక్

స్నేహా ఉల్లాల్ కు జూనియర్ ఐశ్వర్య గా గుర్తింపు ఉంది. చేసినవి తక్కువ సినిమాలే కానీ మంచి గుర్తింపే లభించింది ఆమెకు. హాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో ఆఫర్ రాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని రోజులకు ఆ సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది. తర్వాత ప్రారంభించినా స్నేహాను మాత్రం తీసుకోలేదు. ఆ సమయంలో ఆమె కూడా చేసేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎందుకంటే అప్పటికీ ఆమె కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. అప్పటి నుంచి దాదాపు చాలా రోజుల వరకూ ఆమె ఇండస్ట్రీలో కనిపించలేదు. ఒకటి రెండు వెబ్ సిరీస్ లో కనిపించినా అవి కూడా అంతగా రాణించలేదు.

ఇంటర్వ్యూలో ఉల్లాల్

ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను చెప్పుకచ్చింది. ఆమె మాటల్లోనే విందాం.. ‘నేను సినిమా ఇండస్ట్రీలో ఎదగలేకపోయాను. అందుకు కారణం ఉంది. కొంత మంచి యాక్టరస్ లా నేను కమిట్ మెంట్ ఇవ్వను. కథ, అందులో నా పాత్ర బాగుంటే మాత్రమే చేస్తాను. అలా అని మంచి కథ, మంచి పాత్ర కమిట్ మెంట్ అవసరం అంటే వదిలేసుకుంటాను కానీ కమిట్ మాత్రం కాను.

నా కంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. వాటని అస్సలు బ్రేక్ కానివ్వను. సినిమాలు ఇవ్వాల వస్తాయి.. రేపు పోతాయి.. కానీ లైఫ్ ఒకటే కదా.. దాన్నే నాకు నచ్చినట్టు మలుచుకుంటాను. కానీ ఇలాంటి వాటికి కమిట్ కాను.’ అంటూ చెప్పుకచ్చింది. ఇప్పుడు ఈ మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.