ఆ పని చేసి నష్టాల్లో కూడుకుపోయిన మన టాలీవుడ్ హీరోలు

0
941

ఈ మధ్య హీరోలు డబ్బులను ఇతర చోట్ల పెట్టుబడులుగా పెడుతూ మరింత గడించవచ్చనే చూస్తున్నారు. ఇది చాలా కాలం నుంచే కొనసాగుతుంది. ఇతర రంగాలలో పెట్టుబడి పెట్టడంలో నేటి తరం హీరో విజయ్ దేవర కొండ వరకూ కొనసాగింది. కొందరు మల్టీప్లెక్స్ థియేటర్లలో పెట్టుబడులు పెట్టగా మరికొందరు ఫుడ్ అండ్, లిక్కర్ రెస్టారెంట్లో, ఇంకొందరు పబ్ లోల పెట్టుబడులు పెట్టి అదనంగా సంపాదించుకోవాలని చూస్తున్నారు. కానీ వాటిలో నష్టం వాటిళ్లి పీకల్లోతు కష్టాల్లో కూడుకుపోయిన వారు కూడా లేకపోలేదు. అలాంటి స్టార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మహేశ్ బాబు

మహేశ్ బాబూ ఏఎంబీ మల్టీఫ్లెక్స్ ను నడిపిస్తున్నాన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నగరంలో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ రెస్టారెంట్ 2022లో కొంతకాలం నష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో చాలా మంది అది మూసేయ్యాలని ఆయన ఉచిత సలహాలు ఇచ్చారు. దీంతో అదనపు భారం పెట్టుకోవద్దని సూచించారు. కానీ మహేశ్ బాబు మాత్రం వారి మాటలు పట్టించుకోలేదు. కొంత కాలానికి రెస్టారెంట్ మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు ఆయనకు చాలా ఆదాయం వస్తుంది.

వెంకటేశ్

దగ్గుబాటి కుటుంబం ఆది నుంచే వ్యాపారాలు చేసే కుటుంబం. ఆయన తండ్రి దగ్గుబాటి రామానాయుడు దేశంలోనే టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరు. వెంకటేశ్ కూడా సినిమాలు చేస్తూ వ్యాపారం వైపు అడుగులు వేశాడు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ స్థలం కొనుగోలు చేసి ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టాడు. ఏఎంబీ విక్టరీ పేరుతో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా నిర్మాణ దశలోనే నష్టాల్లో కూరుకుపోయారు వెంకటేశ్. ఈ థియేటర్ పైనే వెంకటేశ్ తో పాటు రాణా కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవర కొండ స్వయంకృషితోనే ఎదిగారని చెప్పవచ్చు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా తక్కువ సినిమాలతోనే ఇంతటి స్టార్ డమ్ సాధించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. దాదాపు ఆయన చేసిన మొదటి సినిమాతో ఆయనపై విపరీతమైన టాక్ వచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ గా కూడా చేసిన సినిమా బాగా హిట్ అయ్యింది.

ఇటీవల ఆయన తీసిన లైగర్ డిజాస్టర్ అవడంతో పీకల్లోతు ఇబ్బందుల్లో పడ్డారు విజయ్. తన తర్వాతి ప్రాజెక్టు ‘ఖుషి’పై ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారు రౌడీబాయ్. ఈయన కూడా ఒక టెక్ట్స్ టైట్ బిజినెస్ లోకి దిగారు. ‘రౌడీ’ అనే బ్రాండ్ పై బట్టల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ‘రౌడీ వేర్’తో వచ్చిన బట్టలకు గిరాకీ లభించలేదు. దీంతో పాటు ఆయన మల్టీప్లెక్స్ కూడా నిర్మించి లాస్ అయ్యాడు.

వీరితో పాటు మరికొంత మంది కూడా థియేటర్లు, ల్యాండ్లు, తదితరాలపై పెట్టుబడులు పెట్టి చాలానే నష్టపోయారు. మళ్లీ తేరుకొని ముందుకు సాగిన వారు కొందరైతే వెనకే ఉండిపోయిన వారు మరికొందరు. ఏది ఏమైనా చేస్తున్న వృత్తే ధర్మంగా భావించాలి కానీ సైడ్ బిజినెస్ అంటే కలిసి రాకుంటే మాత్రం మేయిన్ బిజినెస్ కూడా దెబ్బతినడం ఖాయం.