‘మనీ’లోకి ఖాన్‌దాదా అలా ఎంటరయ్యాడా

0
217
brahmanandam comedy

తీసే ప్రతి సినిమా హిట్టవ్వాలని దర్శక, నిర్మాతలకు, చేసే ప్రతి సినిమా హిట్టవ్వాలని ఆర్టిస్ట్‌లకు ఉండటం సహజం. కానీ తాము తీసిన కంటెంట్‌ సరైన ఫ్లోలో ఉంటేనే కదా.. ప్రేక్షకులు మెచ్చుకునేది. అందుకే ప్రీ ప్రొడక్షన్‌లోనే ఓ భారీ యుద్ధం జరిగినంత సీన్‌ క్రియేట్‌ అవుతుంది. ఆ తర్వాత షూటింగ్‌ మొదలవుతుంది. చివరగా రష్‌ చూసుకున్నప్పుడు తాము ప్రీ ప్రొడక్షన్‌లో చేసిన యుద్ధంలో ఏదో కీలక ఆయుధం మర్చిపోయామే అని అనుమానం వస్తుంది.

ఇక మళ్లీ మరో మినీ యుద్ధం చేసి, సినిమాను గట్టెక్కిస్తారు. ఇలాంటి సినిమా విజయాలకు ఉపయోగపడిన మినీ యుద్ధాలతో పరుచూరి గోపాలకృష్ణ ‘లెవంత్‌ అవర్‌’ అని పుస్తకం కూడా రాశారు. ఇలా మినీ యుద్ధంతో సూపర్‌హిట్‌ కొట్టిన సినిమా ‘మనీ’. రామ్‌గోపాల్‌వర్మ నిర్మాతగా, శివనాగేశ్వరరావు దర్శకుడిగా ఓ ఇంగ్లీష్‌ సినిమాను చూసి, ఇన్‌స్పైర్‌ అయి ఈ చిత్రాన్ని తీశారు. మొదట ఇందులో బ్రహ్మానందం ఖాన్‌దాదా పాత్రలేదు. సినిమా పూర్తయిపోయింది.

brahmanandam comedy

పానీ పూరి తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?

బయ్యర్ల కోసం అన్నపూర్ణ స్టూడియోలో షోలు వేస్తూనే ఉన్నారు. కానీ ఏం లాభం లేదు. చూసిన అందరూ బాగానే ఉందన్నట్లు ఫీలవుతున్నారు కానీ.. ఏదో మిస్సయినట్లు మాట్లాడుతున్నారు. ఏం చేయాలో తోచడం లేదు వర్మ, శివనాగేశ్వరరావులకు. ఓరోజు తమ్మారెడ్డి భరద్వాజకు కూడా సినిమా చూపించారు. ఆయన సినిమా చూసి, బాగానే తీశారు కానీ.. ఇందులో జయసుధ పాత్ర మోడ్రన్‌గా ఉంది. మన ప్రేక్షకులు ఆమెను ఇలా రిసీవ్‌ చేసుకుంటారంటే డౌటే.

‘గుంటూరు కారం’ లో పాటలొద్దు అంటూ రచ్చ

ఏదైనా సింపతీ క్రియేట్‌ అయ్యేలా చేస్తే బాగుటుంది అన్నారు భరద్వాజ. దానికి రాము కామెడీగా మాట్లాడకండి గురువుగారు.. ఇప్పుడు జయసుధ సీన్‌లు రీషూట్‌ చేయాలంటే మళ్లీ దాదాపు సినిమా మొత్తం తీయాలి అన్నారు. వీరి మాటల్లో ‘‘కామెడీగా…’ అన్న పదం శివనాగేశ్వరరావు బుర్రలోకి దూరిపోయి తెగ అల్లరి చేస్తోంది. ఇక లాభం లేదనుకుని వర్మతో బాసూ.. ఇప్పుడు మనం చేయగలిగింది ఏదైనా ఉంటే అది కామెడీ ట్రాక్‌ను పెట్టడమే.

ఎందుకంటే ఆల్రెడీ సినిమాలో జేడీ, చిన్నా, పరేష్‌రావెల్‌ పాత్రలు కామెడీగానే సాగుతాయి. వీరి సీన్లు వచ్చినప్పుడు షో చూస్తున్నవారి ముఖాల్లో నవ్వులు చిందుతున్నాయి. కాబట్టి దీనికి కామెడీ ట్రాకే సరైన మందు అన్నారు. వర్మకు కూడా ఇదే కరెక్ట్‌ అనిపించింది. ఆ క్షణం మాయం అయిన శివనాగేశ్వరరావు బుర్ర బద్ధలు కొట్టుకుని మూడు రోజుల తర్వాత ‘ఖాన్‌దాదా’ క్యారెక్టర్‌తో వర్మ ముందు ప్రత్యక్షం అయ్యారు.

ముందు సెపరేట్‌ కామెడీ అనుకున్నప్పటికీ షూటింగ్‌లో యూనిట్‌ పొట్ట చెక్కలయ్యేలా నవుతుండడంతో దాన్ని మెయిన్‌ కథలోకి కూడా లింక్‌ చేసి, కొన్ని సీన్‌లు రీషూట్‌ చేసి వదిలారు అంతే.. సినిమా సూపర్‌హిట్‌ అయిపోయింది. మొత్తానికి అలా బ్రహ్మానందం ‘మనీ’లోకి ఎంటర్‌ అయ్యారన్నమాట.