పానీ పూరి తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?

0
389
pani puri uses

పానీ పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు పానీ పూరి ని అమితంగా ఇష్టపడుతూ తింటుంటారు. కొన్ని ప్రాంతాలలో పానీ పూరి ని గోల్ గొప్పా అని పిలుస్తుంటారు. స్ట్రీట్ ఫుడ్ గా పిలవబడే పానీ పూరి ని అశుభ్రమైన త్రింది పదార్థం గా చాలా మంది అభివర్ణిస్తూ ఉంటారు.

పానీ పూరీలు ఎక్కడ పడితే అక్కడ తినడం మంచిది కాదని, శుభ్రమైన నీళ్లతో పానీపూరీని ని అందించడం చాలా అరుదుగా జరుగుతుందని, దీని వల్ల అనేక రోగాలు వస్తాయని కొంతమంది అంటూ ఉంటారు. ఇందులో కొంతవరకు అయితే నిజం ఉంది కానీ, ఎదో ఒకటి రెండు ప్రాంతాలలో జరిగిన సంఘటనలను ఉదాహరించి ప్రపంచం లో ఎక్కడా కూడా పానీ పూరి బాగుండదు అనడం సరికాదు. పానీపూరి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

సాధారణ ఉప్పు బదులు బ్లాక్ సాల్ట్ వాడుతున్నారా!..

పానీ పూరి తినడం వల్ల జీర్ణప్రక్రియ చాలా మెరుగ్గా జరుగుతుందట. జీలకర్ర, చింతపండు మరియు నిమ్మరసం కలపడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడంలో సహాయపడుతుంది అట. అంతే కాదు ఇందులో మేగ్నేషియం, పొటాషియం మరియు విటమిన్ సి వంటివి ఉండడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. అంతే కాకుండా ఈ పానీ పూరి తినడం వల్ల బరువు తగ్గుతారు అని చెప్తే మీరు నమ్ముతారా?, కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి.

ఒక మోతాదు లో పానీ పూరి తినడం వల్ల అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ మన శరీర బరువుని తగ్గించడానికి సహాయపడుతుంది అట. మన శరీరం లో ఉన్న రక్తం లో షుగర్ కంటెంట్ ఎక్కువ అవ్వడం వల్ల అనారోగ్యాలకు గురి అవుతుంటాం, కానీ పానీ పూరి తినడం వల్ల షుగర్ కంటెంట్ ని పెరగకుండా నివారిస్తుంది అట. ఇదంతా పక్కన పెడితే పానీ పూరి లో జోడించిన జల్జీరా నీరు ఎసిడిటీ మరియు దాని వల్ల కలిగే అసౌకర్యాలకు నివారిస్తుంది.

ఇందులో వాడే కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలు బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అయితే ఈ పానీ పూరీలను హెల్త్ కి మంచిగా ఉండేలా చెయ్యడం కూడా ఆర్ట్. ఆవిరి మీద ఉడికించిన పానీ పూరి ని ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అశుభ్రమైన పరిసరాల్లో కాకుండా, క్లీన్ ఉన్న చోట్ల పానీ పూరీలు తినండి.