సాధారణ ఉప్పు బదులు బ్లాక్ సాల్ట్ వాడుతున్నారా

0
478

సాధారణ రసాయన ఉప్పుకంటే నల్ల ఉప్పు వాడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్ల ఉప్పు వాడినా రుచిలో పెద్దగా తేడా ఉండదని, దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు. బీపీని కూడా తగ్గించడంలో ఈ ఉప్పు ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలుపుతున్నారు. నల్ల ఉప్పుతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందని, హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పునే వాడాలని కూడా సూచనలు చేస్తున్నారు. రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేయడంలో ఇది ఎంతో తోడ్పడుతుందని దీంతో హార్ట్ ఎటాక్ లాంటివి రాకుండా ఉంటాయని సూచిస్తున్నారు.

అలాగే నల్ల ఉప్పులో శరీరానికి కావాల్సిన ఐరన్ ఉంటుంది. దీంతో రక్తం బాగా వృద్ధి పొందుతుంది. రక్తహీనత సమస్య కూడా నివారిస్తుంది. సైనస్, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో నల్ల ఉప్పు భేషుగ్గా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉప్పును తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయని చెప్తున్నారు.

అదనపు ప్రయోజనాలు

-దీంతో డయాబెటిన్ ను నియంత్రించవచ్చు. ఇది వాడితే షుగర్ కూడా అదుపులో ఉంటుంది.
-కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఉప్పు వాడితే మేలని చెప్తున్నారు కీళ్ల వైద్యుల నిపుణులు. ఎముకలు కూడా ధృడంగా తయారవుతారట.

-నిద్రలేమితో బాధపడేవారు నల్ల ఉప్పు వాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు.
-మానసిక ప్రశాంతత చేకూరుతుందని సూచిస్తున్నారు.
– అధిక బరువుతో బాధపడుతున్నవారు నల్ల ఉప్పు వాడితే అధిక బరువును మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు.
-శరీరంలోని బ్యాడ్ కొలస్ట్రాల్ కూడా క్రమ క్రమంగా దూరం అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయడంలో సాయం చేస్తుంది.

-వెంట్రుకలు కూడా దృఢంగా మారి, ఒత్తుగా ఉంటాయి. తెల్ల వెంట్రుకలుగా మారే సమయం పెరుగుతూ వస్తుంది.
-చర్మం కూడా కాంతివంతంగా మారి మంచి నిగనిగలాడుతుంది.

నల్ల ఉప్పుతో ప్రయోజనాలు

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రసాయనిక మిశ్రమం అయిన సాధారణ ఉప్పన వాడకుండా నల్ల ఉప్పు వాడుతూ ప్రయోజనం పొందాలి. దీన్ని నిమ్మరసంతో నీళ్లతో కలిసి పరిగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఏ రకంగా తీసుకున్న నల్ల ఉప్పుతో ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.