ఈ 6 లక్షణాలు కనిపిస్తే వెంటనే బరువు తగ్గాలి

0
848

ఊబకాయం ఇది ప్రస్తుతం జనరేషన్ కు పరిచయం అవసరం లేని ఆరోగ్య సమస్య. చిన్న తనం నుంచే పెద్ద పెద్ద పొట్టలు వేసుకుంటూ ఈ తరం యువత ఈడ్చుకస్తుంది. కొన్ని రోజులు పర్వాలేదనిపించినా తర్వాత మాత్రం ప్రాణాపాయం తప్పదు. సాధారణ పనులు చేసుకునేందుకు ఊబకాయం అడ్డుగా నిలుస్తుంది. దీంతో పనులు చేయడంలో వెనకే ఉండిపోతాం.

ఫలితంగా శారీరక శ్రమ ఉండదు. ఇక ఊబకాయం కూడా దూరం కాదు. ఇలా ఒకదానికొకటి ముడివేసుకుంటాయి. అయితే శరీరం చూపించే కొన్ని హెచ్చరికలతో మీరు వేగంగా ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు మరి. ఆ హెచ్చరికల్లో 6 సంకేతాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కాళ్ల నొప్పులు

సాధారణంగా ఏదైనా పని చేసిన తర్వాత కాళ్ల, కీళ్ల నొప్పులు వస్తాయి. కానీ స్థూలకాయులకు దీర్ఘకాలికంగా ఇలాంటి నొప్పులే వేధిస్తుంటే మాత్రం అదొక హెచ్చిరకలా భావించాలి. దీంతో పాటు కీళ్లు, ఎముకలపై వెయిట్ ఎక్కువై చిన్న దెబ్బకే పగిలిపోవచ్చు. కాబట్టి ఎక్కువ కాలం కాళ్ల నొప్పులు వేధిస్తుంటే వెంటనే బరువు తగ్గాలని సూచనగా భావించాలి.

ప్రస్తుతం జీవన శైలి చాలా విచిత్రంగా ఉంది. ఎక్కువగా కూర్చోని పని చేయడం, శరీరానికి కావాల్సినంత వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, తరుచూ విటమిన్స్ లోపంతో బాధపడడం లాంటివి జరుగుతుంటే ఒక వేళ స్థూలకాలయంగా ఉన్నట్లయితే వెంటేనే బరువు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉన్న సమస్యలకు అదనపు ఆరోగ్య సమస్యలు తోడై మరిన్న ఇబ్బందుల్లో కూరుకుపోతారు.

అలసట

అధిక బరువుతో ఉంటే శరీరం త్వరగా అలిసిపోతుంది. చిన్న పనికే అలసట వస్తుంది. సాధారణంగా స్థూలకాయంగా ఉన్న వ్యక్తుల్లో అంతర్గత అవయవాలు అదనపు పని చేయాల్సి ఉంటుంది. ఇందు వల్ల వాటికే ఎక్కువ శక్తి ఖర్చు కావడంతో ఇక తక్కువ పని చేసినా ఎక్కువ అలసట కలుగుతుంది. ఇది జీవన క్రియలో రోజువారి పనులకు తీవ్రంగా ఆటంకం కలిగిస్తుంది. ఈ హెచ్చరిక కనిపించినా వీలైనంత త్వరగా మీరు బరువు తగ్గాల్సి ఉంటుంది.

శరీరానికి నీరు చాలా విధాలుగా పని చేస్తుంది. ఇటు మంచిగా అటు చెడుగా.. శరీరానికి కావాల్సినంత మాత్రమే నీరు తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నా ప్రమాధమే తక్కువైనా ప్రమాధమే. అయితే నీటిని తక్కువగా తీసుకుంటే చెడు మలినాలు బయటకు రావు. అలా అని ఎక్కువ తీసుకుంటే కండరాలలో పేరుకుపోతుంది.

కాళ్లను విడిదీసి నడువడం

సాధారణంగా బక్కగా ఉన్న వ్యక్తులు నడిస్తే అడుగులు మామూలుగానే పడతాయి. కానీ స్థూలకాయంగా ఉన్న వారు అడుగులు వేస్తే మాత్రం బాగా విడదీసి పడతాయి. ఎందుకంటే బక్కవారి తొడలలో కొవ్వు ఉండదు కాబట్టి సులువుగా అడుగు పడుతుంది. కానీ స్థూలకాయుల తొడల్లో కొవ్వు ఉంటుంది కాబట్టి అడుగులు వెడల్పుగా పడతాయి. దీంతో మీ రూపంలో కూడా తేడా వస్తుంది. ఇలాంటి సంకేతం కనిపించినప్పుడు వెంటనే బరువు తగ్గాలి.

శ్వాసలో తేడా

కొంచెం దూరం నడవడంతోనే పెద్ద పర్వతాన్ని అధిరోహించిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటారు. ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఛాతినొప్పి వస్తుంది. బాగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇవి శారీరక శ్రమ లేకపోవడానికి సంకేతాలు. కాబట్టి ఇలాంటి వారు వెంటనే తమ శరీరంలోని బరువును తగ్గించుకోవాలి.