శరీరంలో క్యాల్షియం లోపించిందా.. ఇలా తెలుసుకోవచ్చు

0
397

మానవుడితో పాటు జంతువులలో కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఖనిజం ‘క్యాల్షియం’. ఇది శరీర నిర్మాణానికి అంత్యంత ముఖ్యం. ఎముకల పెరుగుదల, దృఢత్వం, గోళ్లు తదితరాల ఏర్పాటుకు ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా, గుండె లయ తప్పకుండా చూస్తుంది. ఇది ఎక్కువగా పాల పదార్థాల నుంచి వస్తుంది. పాలతో పాటు జున్ను, గుడ్లు, పెరుగు, గోంగూర, పన్నీరు, క్యాబేజీ, బచ్చలికూరతో పాటు చాలా రకాల ఆకు కూరల్లో లభిస్తుంది. తాజా నారింజ పండ్లలోనూ, తృణ ధాన్యాల లోనూ విరివిగా లభిస్తుంది. ఇది లోపించడం వలన శరీరంలో కలిగే మార్పుల గురించి తెలుసుకుందాం.

రోజుకు ఎంత అవసరం పడుతుంది

పుట్టినప్పుడు మానవ శరీరంలో 26 నుంచి 30 గ్రాముల క్యాల్షియం ఉంటుంది. తర్వాత పెరుగుదలను బట్టి మారుతూ వస్తుంది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత స్త్రీలలో, పురుషులలో వేర్వేరు విధంగా ఉంటుంది. స్త్రీలలో అయితే 1200 గ్రాములు, పురుషులలో అయితే 1400 గ్రాములకు చేరుకుంటుంది. సగటున ఒక వ్యక్తికి రోజు 1000 గ్రాముల క్యాల్షియం అవసరం పడుతుంది. 50 సంవత్సరాలు పైబడిన స్త్రీలు, 71 సంవత్సరాలు దాటిన పురుషులకు అయితే రోజుకు 1200 గ్రాములు అవసరం అవుతుంది.

చాలా వ్యాధులకు కారణం కావచ్చు

క్యాల్షియం లోపిస్తే మహిళల్లో పీరియడ్స్ కాలంలో హెచ్చు తగ్గులు వస్తాయి. దీంతో పాటు ఎముకలు దృఢత్వం కోల్పోతాయి. దంతాల కూడా పెలుసుగా మారుతాయి. దృఢత్వం కోల్పోయిన ఎముకలు పెలుసుగా మారి చిన్నపాటి గాయానికే విరిగిపోతాయి. గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడంలో తీవ్ర జాప్యం ఏర్పడి రక్తీహనతకు కూడా దారి తీస్తుంది. ఎక్కువ రోజులు శరీరానికి కావలసిన క్యాల్షియం ఉత్పత్తి కాకపోతే పెద్దపేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

దీనితో పాటు రక్తపోటు కూడా పెరిగి క్రమంగా గుండె జబ్బులకు కూడా ఇది దారి తీస్తుంది. అధిక బీపీ బ్రెయిన్, హార్ట్ స్ర్టోక్ కు కూడా కారణం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గుర్తించి వైద్యుడిని సంప్రదించారు.

విటమిన్-డీ లోపం ఏర్పడుతుంది

శరీరంలో సరిపడా క్యాల్షియం లేకపోతే దంతాలు కూడా పటుత్వాన్ని కోల్పోతూ పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. ఇది విటమిన్-డీ లోపానికి కూడా దారి తీస్తుంది. విటమిన్-డీ లోపిస్తే శరీరంలోని బ్లాక్ సెల్స్ సంఖ్య తగ్గుతుంది. దీంతో చర్మం బొల్లిగా మారుతుంది. మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ లో క్యాల్షియం ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ హార్మోన్ నిద్ర పట్టేందుకు సహాయ పడుతుంది. క్యాల్షియం లోపంతో హార్మోన్ విడుదలవక నిద్రలేమి వ్యాధి కూడా సంక్రమించే అవకాశాలు లేకపోలేదు.

ఇలా చాలా పనులు నిర్వహించేందుకు క్యాల్షియం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే శరీరంలో ఎలాంటి లోపం ఉన్నా ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించాలి. ఆయన సూచనల మేరకు మందులు వాడితే ఇలాంటి అనేక అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు.