ఈ విటమిన్ లోపాన్ని సరి చేయండి లేదంటే ఎక్కువ జుట్టు రాలుతుంది..

0
189
Correct this vitamin deficiency or you will experience more hair loss

చాలా మందిని వేధిస్తున్న సమస్య తక్కువ వయస్సులోనే జుట్టు రాలిపోవడం. దీనికి కారణం పెరుగుతున్న కాలుష్యం కావచ్చు.. తీవ్రమైన ఒత్తిడి కావచ్చు..

విశ్రాంతి లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహారం లేకపోవడం ఇలా చాలనే కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోతగింది పోషకాహార లోపం.

పోషకాహారం లోపం ఉంటే సరైన హార్మోన్లు విడుదల కాక ఆ హార్మోన్ కు సంబంధించి ఎంజైమ్ లు రిలీజ్ కాక ఆ ఎంజైమ్ ల తాలూకు శరీర భాగాల్లో లోపాలు ఏర్పడుతాయి.

ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే 13 రకాల పోషకాలు కావాలి. వాటిలో విటమిన్లు, మినరల్స్, విటమిన్ బీ (B) ముఖ్యమైనవి. బయోటిన్ (B7), ఫోలేట్ (B9), విటమిన్ (B12) ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

Are you sleeping with your phone next to you

తృణ ధాన్యాలు
తృణ ధాన్యాలు జుట్టు ఎదిగేందుకు, దృఢంగా మారేందుకు సాయపడతాయి. గోధుమ, బార్లీ, ఓట్స్, జొన్నలు, మిల్లెట్ వంటి వాటిలో విటమిన్ బీ1, బీ2, బీ3, బీ5 ఎక్కువగా ఉంటాయి. డైట్ లో ఎక్కువగా తృణ ధాన్యాలు వినియోగిస్తే జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

అవకాడో..
రిబో ఫ్లేవిన్, విటమిన్ బీ12, విటమిన్ బీ3, నియాసిన్ మెండుగా ఉంటాయి. ఇది జుట్టు పొడవుగా, బలంగా ఉండేందుకు దోహద పడుతుంది.

దీన్ని సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు లేదా స్మూతీగా కూడా తీసుకోవచ్చు. దీనిని ఎక్స్ టర్నర్ హెయిర్ కోసం కూడా వినియోగించుకోవచ్చు.

నట్స్
నట్స్ లో థయామిన్ విటమిన్ బీ1 ఉంటుంది. నాడీ వ్యవస్థ కార్యాచరణలో ఇవి బాగా పని చేస్తాయి. ముఖ్యంగా ఆహారం నుంచి పోషకాలను శక్తిగా మార్చడంలో ఉపయోగపడతాయి.

ఇది జుట్టు కణాలను మెరుగు చేయడంలో తోడ్పడుతుంది. డైట్ లో బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, అవిసె గింజలు, పిస్తాలు, గుమ్మడి గింజలు ఉండేట్టు చూస్తే హెల్దీ జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.

చేపలు
చేపల్లో ఎక్కువగా ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లంలో విటమిన్ బీ3, బీ6, బీ12 ఉంటాయి ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యానికి బాగా అవసరం. వారానికి రెండు సార్లు డైట్ లో చేపలు ఉండేలా చూసుకుంటే మంచిది.

గుడ్డు
జుట్టు హెల్దీగా ఉండాలంటే రోజు కొక గుడ్డు తినాలి. ఇందులో విటమిన్ బీ5 ఉంటుంది. కేశాల కణాలకు శక్తిని అందించడంలో ఇది సాయపడుతుంది.

బీ5తో పాటు ఇందులో బీ12 కూడా ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో బాగా సాయ పడుతుంది.

దీంతో పాటు జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఏవిధంగానైనా దీన్ని తీసుకుంటే మేలు కలుగుతుంది.

పాలకూర
ముదురు ఆకుపచ్చ రంగు ఆకు కూరలైన పాలకూర, కొత్తిమీర, మెంతి, తదితరాల్లో ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను దృఢంగా చేయడంలో సాయం చేస్తుంది. రోజుకు కప్పు చొప్పున ఆకు కూరలు తీసుకోవాలి. జుట్టుతో పాటు చాలా భాగాలకు ఇది మంచి ఫుడ్.

పాలు
పాలలో ఎక్కువగా కాల్షియం, ప్రొటీన్ ఉంటాయి. డెయిరీ ఉత్పత్తుల్లో విటమిన్ బీ7 (బయోటిన్) సమృద్ధిగా లభిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. డెయిరీ డెయిరీ ఉత్పత్తులను తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య ఉండదు.

ఇవన్నీ రోజువారీ డైట్ లో ఉంచుకునేలా చూస్తే ఒక్క జుట్టు సమస్యలే కాదు చాలా సమస్యలను అరికడతాయి.

గమనిక: ఈ ఆర్టికల్ ఆరోగ్య నిపుణుల వివరాల ప్రకారం అందించా. ఇది కేవలం అవగాహన కోసమే. సమస్యలపై వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.