పళ్లు తోమకుండానే నీరు తాగుతున్నారా..? ఏమవుతుందో తెలుసా..?

0
1487

చాలా మంది ఉదయం లేవగానే పళ్లు తోమకుండానే, కనీసం నోటిని శుభ్రం చేసుకోకుండానే నీటిని తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా..? పళ్లు తోముకొని నీరు తాగితే ఏమవుతుందని ఎప్పుడైనా సందేహం కలిగిందా. ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తాతల కాలం నుంచే అలవాటు

మన తాతలు దాదాపుగా ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారు ఉదయం పరగడుపున లేవగానే కనీసం పళ్లు కూడా తోమకుండా నీటిని తాగుతారు. దీని వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా..? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ మన తాతలు మాత్రం చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అయితే ఇది మంచిదేనా కాదా అనే సందేహం ఇప్పటికి సగం తొలిగిపోయి ఉంటుంది. ఇక ఇందులో శాస్ర్తీయ కోణాలను కూడా చూద్దాం. ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందో ఆరోగ్య నిపుణులు కూడా ఏం సూచనలు చేస్తున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం.

పెద్దలు సూచిస్తున్నది కూడా అదే

మన పెద్దలు కూడా లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగాలని చిన్నప్పటి నుంచి మనకు సూచిస్తుంటారు. రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిని ఇలా తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయని వారు చెప్తారు. జీర్ణక్రియ సమస్యలు ఉంటే నెమ్మదిగా తగ్గిపోతాయని, కిడ్నీలకు కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ అలవాటు ఎక్కువగా జపాన్ లో ఉంటుంది. వారు లేవగానే బ్రష్ చేసుకోకుండా చెంబడు (దాదాపు 3 గ్లాసుల వరకూ) నీటిని తాగుతారు. దీని వల్ల శరీరానికి ఎటువంటి హానీ కలగదని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు.

జీర్ణాశయానికి మంచిది

అయితే నోటిలోని బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి ప్రవేశించి ఏమైనా అనారోగ్యం ఏర్పడుతుందని అనుమానాలు కూడా అక్కరలేదట. ఉదయం నీటిని తాగడం వల్ల నోటిలోని లాలాజలంతో కలిసిన నీరు జీర్ణాశయంలోకి వెళ్తుంది. లాలాజలంలో ఉండే ఆమ్లాలతో నోటిలోని బ్యాక్టీరియా కూడా చనిపోతుందట. కాబట్టి పళ్లను తోమకున్నా నీటిని తాగవచ్చు. ప్రతి రోజూ ఉదయం లేవడంతోనే కాళీ కడుపుతో నీటిని తాగితే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు సాధారణ శ్వాస సమస్యలతో (జలుబు, శ్వాస సంబంధిత) బాధపడుతున్న వారు ఉదయం (పరగడుపున) గోరువెచ్చని నీటిని తాగితే క్రమంగా శ్వాస సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుతుందని సూచిస్తున్నారు.

శ్వాస సమస్యలకు కూడా చెక్

కావాల్సిన నీటిని ఉదయం తీసుకోవం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుందట. చర్మంలోని మృత కణాలు కూడా తొలగిపోతాయని, వాటి స్థానంలో ఉత్తేజితమైన కొత్త కణాలు పుట్టుకస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మలబద్ధకం సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదర సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలుస్తోంది. క్యావిటీస్ తగ్గుతుందని బీపీ, డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు తాగితే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు.

ఆయుర్వేద నిపుణులు కూడా సూచిస్తున్నారు

ఆయుర్వేద వైద్య నిపుణులు చాలా కాలంగా ఈ పద్ధతిని పాటిస్తూ. ఇది ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. యోగా చేసే వారు ఉదయమే పరిగడపున నీటిని తాగి కాలకృత్యాలు తీర్చుకొని యోగా చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఇక తెలిసింది కదా.. ఉదయం పరిగడపున నీటిని తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కావున తాగడం మానవద్దు.

నోట్: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఇదే ప్రామాణికం కాదు.. ఏ ఆరోగ్య సమస్యకైనా వైద్యులను కలవడం మంచిది.