‘విటమిన్ డీ’ లోపం ఉందా.. అయితే ఈ సమయంలో ఎండలో ఉంటే సరిపోతుంది

0
584

ప్రకృతి జీవులు కలిసి ఉన్నప్పుడు రెండు వైపులా మేలు జరుగుతుంది. ముఖ్యంగా హ్యూమన్ ‘బాడీలో డీ’ విటమిన్ చాలా ముఖ్యం ఇది లోపిస్తే కీళ్ల నొప్పులు, ఎముకల దృఢత్వం తగ్గుతుంది. అయితే ఎక్కువగా విటమిన్ డీ సూర్యరశ్మితో మన శరీరం తయారు చేసుకుంటుంది. ఇది ప్రొటీన్లు, విటమిన్లు, కొన్ని హార్మోన్స్ ఉత్పత్తిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు కొన్ని రోగాలను ఎదుర్కొనేందుకు కూడా ఇది సాయ పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

లోపంతో కలిగే దుష్పరిణామాలు

హ్యూమన్ బాడీలో విటమిన్ డీ లోపిస్తే చాలా దుష్పరిణామాలు కలుగుతాయి. జుట్టు రాలడం, ఎముకల పటుత్వం తగ్గిపోవడం, శ్వాసకోస సంబంధిత వ్యాధులు, కండరాల బలహీనత, బరువు పెరగడం, అనేక సమస్యలు వస్తాయి. విటమిన్ డీని సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా సూర్యరశ్మిని గ్రహించి శరీరం తయారు చేసుకుంటుంది అందుకే దీన్ని సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. దీంతో పాటు కొన్ని రకాల చేపలతో కూడా విటమిన్ ఉత్పత్తి అవుతుంది. ఆరోగ్య నిపుణుల అంచనా ప్రచారం ప్రతి రోజూ శరీరానికి 600 యూఐ విటమిన్ డీ అవసరం అవుతుంది.

సూర్యరశ్మిలో ఎంతసేపు ఉండాలి

కొన్ని ప్రత్యేక సమయాల్లో ఎండలో కూర్చోవడం వల్ల ఇది ఉత్పత్తి అవుతుంది. దీని కోసం ఏ సమయాల్లో ఎండలో కూర్చోవాలి..? ఎంత సేపు ఉండాలి..? అనే విషయాన్ని నిపుణులు సూచించారు. దీంతో పాటు ఏ ఆహారంతో విటమిన్ డీ లోపాన్ని అధిగమించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం.. సూర్యోదయం (సూర్యుడు ఉదయించే సమయంలో) తొలి కిరణాలు భూమి మీద పడే సమయంలో విటమిన్ డీకి అవసరమైన సన్ రేస్ బాడీపై పడాలట. దీనితో పాటు సన్ రైస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఎండలోకి వెళ్లవద్దని కూడా సూచిస్తున్నారు.

చర్మం ముదురు రంగులో ఉన్న వారు

సన్ రైస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఎండలో ఉంటే చర్మానికి సంబంధించి మెలనోమా అనే వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇది ప్రాణాంతకమైనదిగా కూడా చెప్తున్నారు. ఏ సమయంలోనైనా కళ్లను రక్షించుకోవాలి. చర్మం ముదురు రంగులో ఉన్న వారు 30 నిమిషాల కంటే ఎక్కువగా ఎండలో ఉండద్దని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక లేత చర్మం ఉన్న వారు కూడా 15 నిమిషాల కంటే ఎక్కువగా కూర్చోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ నుంచి నీడలోకి వచ్చిన తర్వాత మాత్రమే సన్ క్రీమ్ ఉపయోగించాలని కానీ ఎండలో ఉన్నప్పుడు వాడద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఏ ఆహార పదార్థాలలో విటమిన్ డీ ఉంటుంది?

విటమిన్ డీ ప్రధానంగా సూర్మరశ్మితో ఉత్పత్తి అయినా కొన్ని ఆహార పదార్థాలతో కూడా ఉంటుంది.
-విటమిన్ డీ కోసం సాల్మాన్ చేపలను ఆహారంలో ఉపయోగించాలి. ఇందులో విటమిన్ డీ కి సంబంధించి పోషకాలు విరివిగా ఉంటాయి. ఒక వేళ చేపలు తినేందుకు ఆసక్తి చూపని వారై ఉంటే.. కాడ్ లివర్ ఆయిల్ ఉపయోగించవచ్చు ఇది కూడా ఉత్తతమమైనదే. గుడ్లు పచ్చ సొనలో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు గుడ్డులో మరిన్ని పోషకాలు లభిస్తాయి. పుట్ట గొడుగులు, ఆవుపాలు, సోయా పాలు, నారింజ రసం, వోట్మీల్ కూడా తీసుకోవచ్చు.

(నోట్ : అవగాహన కోసం మాత్రమే వీటిని పొందుపరచడం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడమే అన్నింటికీ మేలు)