ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తే ఎంతటి ప్రయోజనాలో.. తెలిస్తే వెంటనే లేచి కూర్చుంటారు

0
373

ఉదయం లేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక రోజులో చాలా సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దీనిని ఎవ్వరూ పటించరు. కొందరు చేసే నైట్ డ్యూటీలో గురించి వేరు. రాత్రంతా డ్యూటీ చేస్తారు కాబట్టి ఉదయం వేళ పడుకుంటారు. కానీ మరికొందరైతే ఉదయం డ్యూటీ చేసినా మరుసటి రోజు ఉదయాన్నే లేసేందుకు బద్దకిస్తారు. ఉదయం లేవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. మన గ్రంథాలు, పురాణాలు సైతం సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తేనే మంచిదని పేర్కొంటున్నాయి.

పురాణాల ప్రకారం

సూర్యోదయం కంటే ముందే నిద్ర నుంచి మేల్కొంటే వాటిని బ్రహ్మ గడియలు అంటారు. ఇందులో ధ్యానం లాంటివి చేస్తే ముక్తి కలుగుతుందని మన పురాణాలు చేప్తున్నాయి. అందుకే రుషులు ఈ సమయంలో నిద్రలేస్తారు. ఇక సూర్యోదయం సమయంలో నిద్ర లేస్తే మనుష్య గడియాలు అంటారు. ఇందులో ఎక్కువగా సాధారణ జీవినం గడిపే మనుషులు నిద్రలేస్తారు. ఇక సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే రాక్షస గడియలు అంటారు ఇందులో ఎక్కవగా రాక్షసులు మాత్రమే నిద్ర లేస్తారు. అందుకే మనం బ్రహ్మ గడియలు, లేదంటే మునుష్య గడియలలో నిద్ర నుంచి మేల్కోవాలి.

ఉదయం లేవడం ఎక్కువ సమయం ఉంటుంది

ఉదయాన్నే నిద్ర లేవాలని చాలా మంది నిద్రపోయే సమయంలో అనుకుంటారు. కానీ ఉదయాన్నే లేవలేరు. ఉదయం లేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజంతా ఉల్లాసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల వ్యాయామంపై దృష్టి పెట్టవచ్చు. కావలసినంత టైం ఉంటుంది కాబట్టి నడక, యోగా, జిమ్ లాంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. దీంతో ఆరోగ్యంతో పాటు బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

తెలివి తేటలు మెరుగ్గా

అల్పాహారం మనిషి బాడీకి చాలా ముఖ్యం అని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. అల్పాహారంతో చాలా వ్యాధులను దూరం చేయవచ్చని కూడా అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక లేట్ గా లేచి అల్పాహారం లేకుండా ఉరుకులు పరుగులతో ఆఫీస్ లకు వెళ్లడం కంటే ముందే లేవడం అల్పాహారం కూడా వండుకొని తినేందుకు కావలిసినంత టైం ఉంటుంది. ఇక ఉదయం నిద్రలేచే వ్యక్తుల తెలివి తేటలు మెరుగ్గా ఉంటాయని కూడా తేలింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదయం లేవడం ఎన్నో ప్రయోజనాలను తీసుకస్తుంది.

వ్యాయామం పై ప్రధానంగా దృష్టి

శరీరానికి కావలసినంత వ్యాయామం లేకుంటే త్వరగా అనారోగ్యాల భారిన పడతాం. వ్యాయామం బాడీకీ వ్యాధులకు ఒక గేట్ గా ఉంటుంది. ఏది ఎక్కువగా బలంగా ఉంటే అది నెగ్గుతుంది. నిత్యం వ్యాయామం చేయడం వలన ఫిట్ నెస్ ఎక్కువగా ఉండి రోగాలు దరి చేయవు. అయితే ఉదయం నిద్ర లేవడం వల్ల నిత్యం వ్యాయామం చేసుకోవచ్చు. ఇది జీవితంలో భాగమైతే దీర్ఘాయుష్షు మీ చేతిలో ఉన్నట్లే. శారీరక వ్యాయామంతో మానసిక ప్రశాంతత కలిగి మరింత దృఢంగా మారుతారు. అందుకే అన్ని వేళలా ఉదయం లేవడం మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు.