ఎగబడుతున్న సీనియర్ హీరోయిన్స్

0
879

ము ము ము ముద్దంటే చేదా.. ఇప్పుడా ఉద్దేశ్యం లేదా.. అంటూ గతంలో ఒక పాట ఉండేది. అప్పుడు పాటలో కనిపించిన ఐటం గర్ల్ హీరోను ఉద్దేశించి పాడింది. అందులో హీరో కూడా ఆమె కంటే పెద్దవాడే. సీనియర్ హీరోకు ము*ద్దు పెట్టడంలో ఏం మజా జూనియర్ హీరోకు అదీ లిప్ కి**స్ పెడితే అందులో ఎంత మాజా ఉంటుందో అంటున్నా సీనియర్ హీరోయిన్లు.

మారిపోయిన మూవీ ప్రపంచం

ఇప్పుడు సినిమా ప్రపంచం మొత్తం మారిపోయింది. పాన్ ఇండియా, ఇంకా పాన్ వరల్డ్ స్థాయికి ఒక్కో ఇండస్ర్టీ ఉరుకులు పరుగులు పెడుతోంది. కొత్త పోకడలు పోతోంది. హాలీవుడ్ ఆలోచనలతో దర్శకులు, నిర్మాతలు సినిమాలను తీస్తున్నారు. ఇందులో కంటెంట్ కే ప్రధానంగా అగ్రస్థానం కట్టబెడుతున్నారు. ఇందులో దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ప్రస్తుతం వస్తున్న అప్ కమింగ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. రాజమౌళిని అందుకోవాలంటే చాలానే శ్రమించాలి. ఇప్పుడు రాజమౌళి కన్ను హాలీవుడ్ పై పడింది. త్రిపుల్ ఆర్ విజయంతో ఆయన ప్రపంచ దర్శకుడి స్థానానికి పాకాడు.

డిఫరెంట్ కథలతో

ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్లు డిఫరెంట్ కథలతో ఎంట్రీ ఇస్తున్నారు. కంటెంట్ నే ప్రధానంగా తీసుకుంటూ సీనియర్ హీరోయిన్లు, జూనియర్ హీరోయిన్లు, సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అతి తేడా చూపించకుండా డిఫరెంట్ స్టయిల్ లో సెట్ చేస్తున్నారు. సినిమా పంథా మారడంతో వారి ఆలోచనలు కూడా మారుతున్నాయి. సినిమా అంటే ఇలానే తీయాలి అన్న రోజులు ఎప్పుడో పోయాయి. హాలీవుడ్ స్థాయిలో పోవాలంటే కొన్ని హద్దులను దాటాలి మరి. ముఖ్యంగా మూవీస్ లో రొమాన్స్ సీన్స్ గురించి ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి.

రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్స్

ప్రస్తుతం ఇండస్ర్టీకి యువహీరోలు వెల్లువలా వస్తున్నారు. వారితో నటించాలంటే సరిసమానమైన హీరోయిన్లు కూడా వస్తున్నారు. కని ఇక్కడ మనం చర్చింకునేంది ఇది కాదే అనుకుంటున్నారా. అవును మరి హీరోతో రొమాన్స్ సీన్స్ లో హీరోయిన్లకు తామేం తీసిపోమంటూ కొందరు స్టార్ సీనియర్ హీరోయిన్లు కూడా రెడీ అవుతున్నారు. అందులో టబూ, శ్రీయ ఉన్నారు. వీరు ఇండస్ర్టీలో సీనియర్లు అయినా బెడ్రూం సీన్స్, లిప్ లాక్ సీన్స్ చేసేందుకు వెనుకడుగు వేయడం లేదట.

మొహమాటం లేకుండా ఒకే చెప్తున్నారట

తమకంటే హీరో వయస్సు చిన్నదని తెలిసినా కూడా లిప్ లాక్ లాంటి సీన్లకు ఓకే చెప్తున్నారట. ఇక ఏముంది మన హీరోలు కూడా రెట్టింపు ఉత్సాహంతో పెదవులు కలుపుతున్నారు మరి. కథ, కంటెంట్ పరంగా లిప్ లాక్, బెడ్రూం సీన్లను డైరెక్టర్లు చెప్తే మొహమాటం లేకుండా ఒకే చెప్తున్నారట. కథ డిమాండ్ చేస్తే ఏజ్ దేముంది అంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఒక వైపు సినిమా పరంగా చూస్తే వారన్నదే కరెక్ట్ అనిపిస్తుంది మరి. ఏది ఏమైనా యువ హీరోలతో లిప్ లాక్ లో ఉన్న మజా ఎక్కడుంటుంది అనుకుంటున్న సీనియర్ హీరోయిన్లు కూడా లేకపోలేదు.