కేజీఎఫ్ 3 హీరో అతనే.. నిర్మాత

0
590

రాఖీబాయ్.. ఈ పేరున చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వాడి వరకూ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది కాదా.. అవును ఆ డైలాగ్ ను ఎవరూ మరిచిపోలేరు. ఇక ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ మొదట ప్రాంతీయ భాషగానే విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఆ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు. దీంతో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం బాహుబలి రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసిందంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లవాడి నుంచి ముదుసలి వరకూ రాఖీబాయ్ కి ఫ్యాన్స్ అయిపోయారు.

చిత్ర విజయానికి ఆజ్యం పోసిన యష్ నటన

ఇక ఈ చిత్రంలో నటించిన యష్ గురించి తెలుసుకుంటే.. ఆయనకు చిన్నతనం నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఎలాగైనా మంచి స్టార్ హీరో కావాలని అనుకున్నాడు. ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చాడు. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఏదో ఒక పని చేస్తూ, తర్వాత చిన్న చిన్న పాత్రలు వేస్తూ వస్తున్న యష్ కేజీఎఫ్ కు హీరోగా సెలక్ట్ అయ్యాడు. ఇక వరుసగా రెండు పార్టుల్లోనూ ఆయనే కనిపించారు. కేజీఎఫ్ లో యష్ నటన చూపి ఫ్యాన్స్ ను విపరీతంగా పెంచుకోవడంలోనూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

కేజీఎఫ్-3 కూడా

కేజీఎఫ్-1 తర్వాత మరిన్ని అంచాలు పెంచుకొని కేజీఎఫ్-2 రిలీజ్ చేశారు. అది కూడా అంచనాలకు మరింత పెంచుతూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇంతటితో కేజీఎఫ్ చాప్టర్ క్లోజ్ అనుకుంటున్న ప్రేక్షకులకు కేజీఎఫ్-3 కూడా ఉంటుందని డైరెక్టర్ క్లూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో చాప్టర్ 3 కోసం ఫ్యాన్స్ ఇప్పుడు జోరుగా చర్చించుకుంటున్నారు. ఎప్పుడు వస్తుందా.. యష్ ఎలా కనిపిస్తాడు. ఇలా సినీ అభిమానులు ముచ్చటిస్తున్నారు.

2025లో సెట్స్ పైకి చాప్టర్ 3

ఈ నేపథ్యంలో రీసెంట్ గా కేజీఎఫ్ 3పై చిత్ర యూనిట్ స్పందించింది. చాప్టర్ 3ని 2025లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనికి కారణాలను కూడా చెప్తున్నారు. కేజీఎఫ్ రెండు చాప్టర్లకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరింత బిజీగా మారాడు. ప్రభాస్ తో ఆయన ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. దీంతో ప్రభాస్ సినిమాతోనే ఆయన బిజీగా ఉన్నారు. ఇది పూర్తవగానే కేజీఎఫ్ 3 సెట్స్ పైకి తీసుకచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మరో షాకింగ్ విషయం నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆదేంటంటే పార్ట్ 3లో హీరో యష్ ను మారుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరో మారుతున్నారు

కేజీఎఫ్ చాప్టర్ 3లో హీరో యష్ కు బదులుగా మరో హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలలో సంచలనం రేకిత్తిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ‘హోంబలే ఫిలిం’ బ్యానర్ ఓనర్ విజయ్ కిరగందూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాను ఆయన జేమ్స్ బాండ్ సినిమాలతో కంపేర్ చేశారు. అక్కడ మారినట్లుగా ఇక్కడ కూడా మార్చాలని చూస్తున్నట్లు చెప్పారు. కేజీఎఫ్ చాప్టర్లు మళ్లీ మళ్లీ వస్తుంటాయని అందుకు తగ్గ ప్లాన్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే హీరో మారితే కేజీఎఫ్ కు అభిమానులు కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉందని, ఇప్పటికీ రెండు చాప్టర్లలో యష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని ఇప్పుడు మారిస్తే బాగోదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా యష్ అభిమానులు మాత్రం దీన్ని చాలానే వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి క్లారిటీ ఈ ఏడాది మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది.