వారి వల్లే కోట్లు కోల్పోయా.. సుధ

0
1660

సీనియర్ ఆర్టిస్ట్ సుధ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు ఇప్పటి వరకూ 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా అనేక ఇండస్ట్రీల్లో పని చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ గుర్తుకువచ్చే పేరు సుధ. అంతలా పాత్రలు చేయడంలో నిమగ్నమవుతుంది ఆమె. తల్లి, అత్త, వదిన, అక్క ఇలా ఆమె వయస్సుకు తగ్గ ఎన్నో పాత్రలు వేసి మెప్పించింది. ఆమె సినీ రంగానికి చేసిన సేవను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31 జనవరి, 2014లో సత్కరించింది. తన జీవితంలో నటన ఒక భాగం మాత్రమే అని కానీ వెండితెర వెనుక ఇప్పటికీ నరకంలోనే నేను బతుకుతున్నానని చెప్తుంది.

బాల చందర్ సూచన మేరకే క్యారెక్టర్ ఆర్టిస్ట్

తను సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకున్న సమయంలో అందరూ అనుకున్నట్లుగానే హీరోయిన్ గా రావాలని అనుకుందట. కానీ హీరోయిన్ అయితే డీ గ్లామరస్ గా మారి తొందరగా ఇండస్ట్రీని వదిలి వెళ్లాల్సి వస్తుందని, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఎక్కువ కాలం కొనసాగవచ్చని అప్పటి గ్రేట్ డైరెక్టర్ బాల చందర్ సూచించడంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోని వచ్చారు. మొదటి నుంచి బాగానే బతికిన కుటుంబం ఆమెది. దేనికీ లోటు ఉండేది కాదు. కానీ కాలం ఒకే విధంగా ఉండదుగా అందుకే ఇప్పుడు ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. అందరూ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మొదటి నుంచి జీవితాన్ని నెట్టుకస్తుంది.

అల్లు రామలింగయ్య సలహాతో మరిన్ని అవకాశాలు

తమిళనాడులోని శ్రీరంగంలో మంచి శ్రీమంతుల కుటుంబంలో పుట్టారు సుధ. వెండితెరపై కనిపించాలని చిన్నతనం నుంచి అనుకునే వారట. దానికి అదృష్టం కూడా తోడవడంతో తొందరగానే చిత్ర సీమకు పరిచయం అయ్యారు ఆమె. బాలచందర్ సూచనల మేరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో అల్లు రామలింగయ్య నీ పాత్రకు నీవే డబ్బింగ్ చెప్పుకుంటే మరింత ఎక్కువ కాలం కొనసాగవచ్చని సూచించడంతో ఆయన సలహా మేరకు తెలుగు నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పారు సుధ. అల్లు రామలింగయ్య సూచనలతో అవకాశాలు మరింత పెరిగాయి. దీంతో డబ్బు చాలానే సంపాదించింది.

అందరినీ కోల్పోయి ఒంటరిగా

ఇంత గుర్తింపు సంపాదించుకున్న సుధ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరింత సంపాదించాలని కాంక్షతో ఢిల్లీలో హోటల్ బిజినెస్ పెట్టింది. అది లాస్ అవ్వడంతో చాలా కోల్పోయింది. ఇక వ్యక్తిగత జీవితంలో చిన్న తనంలోనే ఆమె తల్లి చనిపోయింది. పెద్దయ్యాక క్యాన్సర్ తో తండ్రిని కూడా పోగొట్టుకుంది. నలుగురు అన్నదమ్ములు ఉన్నా నాన్నను ఎవరూ చూసుకునేవారు కాదు. అతను చినిపోయేంత వరకూ నీనే దగ్గరుండి చూసుకున్నానని చెప్పింది. తన భర్త తనకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తనను విడిచి ఫారిన్ వెళ్లిపోయాడు.

పూర్తిగా మానేశా

ఇక కొడుకు కూడా ఓ విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు. కానీ ఎప్పుడూ తన గురించి కనీసం ఆలోచించడు. వాడితో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడూ ఫోన్ చేయడు. ఎలా ఉన్నావని కూడా అడుగడు అంటూ ఎమోషనల్ అయ్యింది సుధా. ఇన్ని కోల్పోయిన తాను. భవిష్యత్ గురించి ఆలోచించడం పూర్తిగా మానేశానని చెప్తుకచ్చింది. తనకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్తాను ఇదే నా ప్రస్తుత జీవిత ఫిలాసఫీగా తీసుకున్నట్లు చెప్పుకచ్చింది. సుధ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అభిమానులు, సినీ ప్రేక్షకులు వీటిని బాగా వైరల్ చేస్తున్నారు.