మీనా వెంట పడుతున్న స్టార్ హీరో.. ఎందుకో

0
712

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా చాలా చోట్ల తనదైన ముద్రతో నటనలో దూసుకెళ్లారు మీన. ఆమె అప్పట్లో చాలా మంది స్టార్ హీరోలతో జతకట్టి మెప్పించింది. దాదాపు చాలా భాషలకు చెందిన ఇండస్ట్రీల్లో అగ్రహీరోలతో నటించి గుర్తింపు సంపాదించుకుంది మీన. ఆమె నటనతో బాగా ఆకట్టుకునేది. ఆ జమానాలో మీనా తెలియని వారు ఉండరంటే సందేహమే లేదు. అందంగా ఆకట్టుకునేలా ఉన్న ఈ భామను నటనలో అగ్ర హీరోలను, హీరోయిన్స్ ను కూడా పక్కకు నెట్టిందనే చెప్పాలి.

కష్టాల సుడిగుండంలో మీనా

ఇండస్ట్రీలో ఇంత వెలుగు వెలిగిన మీన. ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది మీన. ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్యా సాగర్ ను పెళ్లి చేసుకొని సాధారణ జీవితాన్ని ఎంచుకుంది. చాలా కాలం ఈ జంట సంతోషంగా గడిపింది. ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది మీన. కొవిడ్ బారిన పడిన విద్యా సాగర్ కోలుకొని తర్వాత కొంత కాలానికి పోస్ట్ కోవిడ్ కారణంగా మరణించాడు.

అప్పటి నుంచి కూతురుతో ఆమె ఒంటరిగానే జీవిస్తుంది మీన. అప్పట్లో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు బయటకు రావడంతో వీటిని ఆమె ఖండించారు. ఇలాంటివి క్రియేట్ చేయద్దని హెచ్చరించారు. తను రెండో పెళ్లి చేసుకుంటే ముందుగానే మీడియాకు చెప్తానని క్లారిటీ ఇచ్చి గాసిప్ లకు చెక్ పెట్టారు. అయితే ఇటీవల మరో వార్త నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.

మీనాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నది

కొలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో తనను పెళ్లి చేసుకోమని మీన వెంట పడుతున్నారట. కానీ ఆమె నో చెప్తూ వస్తున్నారట. మీనా బంధువులకు చాలా దగ్గరగా ఉన్న ఒక సీనియర్ స్టార్ హీరో పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని కోలివుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరోకు పెళ్లయి డైవర్స్ కూడా అయ్యాయట. కానీ చాలా సంవత్సరాల నుంచి మీనాపై క్రష్ ఎక్కువగా ఉందట. అందుకే ఆయన ఇటీవల మీనాను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మీనా మాత్రం తను రెండో పెళ్లి చేసుకునేందుకు ఇప్పుడు సిద్ధంగా లేనిని చెప్తూ వస్తున్నారట.

ఒత్తిడి తెలుస్తున్న స్టార్ హీరో

ఈ నేపథ్యంలో తనను ఎలాగైనా రెండో పెళ్లి చేసుకోవాలని ఆయన మీన బంధువుల తరుపు నుంచి చెప్పిస్తున్నట్లు గాసిప్ లు వినిపిస్తున్నాయి. ఎక్కువ కాలం ఒంటరి జీవితం గడుపలేవని త్వరగా పెళ్లి చేసుకుంటే కూతురు జీవితానికి కూడా మంచి జరుగుతుందని కుటుంబ సభ్యులు కూడా మీనాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తాను రెండో పెళ్లి చేసుకోబోనని తన కూతురుతో తను ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకస్తుందట. కానీ సదరు హీరో మాత్రం ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడట. ఆమెను ఎలా ఒప్పస్తాడో చూడాలి మరి.