‘బింభిసార 2 ‘ మొదలయ్యాయేది అప్పుడేనా..? క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్!

0
239
when Bimbhisara 2 movie started

దాదాపుగా మార్కెట్ మొత్తం పోయింది అంటుకుంటున్న సమయం లో కళ్యాణ్ రామ్ కెరీర్ కి ఊపిరి పోసిన చిత్రం ‘బింభిసార’. మార్కెట్ లేదని తెలిసి కూడా రిస్క్ చేసి ఈ చిత్రాన్ని తన స్వీయ నిర్మాణం లో నిర్మించి విడుదల చేసాడు.

రెస్పాన్స్ అదిరిపోయింది, సుమారుగా 40 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కి అటు హీరో గా ఇటు నిర్మాతగా మంచి బూస్ట్ ని ఇచ్చింది ఈ చిత్రం.

ఈ సినిమా విడుదల సమయం లోనే ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకి కూడా డైరెక్టర్ గా వసిష్ఠ వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చాడు.

కానీ ఇప్పుడు వసిష్ఠ రేంజ్ పెరిగిపోయింది. మెగాస్టార్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసిన ఆయన, ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ మరియు రజినీకాంత్ వంటి సూపర్ స్టార్స్ ని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.

తనతో సినిమా చేస్తాను అని చెప్పి, సక్సెస్ రాగానే వేరే హీరోలకు షిఫ్ట్ అయ్యాడని కోపం తో కళ్యాణ్ రామ్ వసిష్ఠ ని దూరం పెట్టేసాడు. ‘బింభిసార 2’ ప్రాజెక్ట్ నుండి వసిష్ఠ ని పూర్తిగా తప్పించి, అనిల్ అడూరి అనే డైరెక్టర్ తో ‘బింభిసార 2’ స్క్రిప్ట్ ని తయారు చేయిస్తున్నాడు.

Kalyan Rams Devil movie in controversy

ప్రస్తుతం ఈ స్కిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, అతి త్వరలోనే పూర్తి చేసి, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన కీలక అప్డేట్ ఇస్తామంటూ కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ ప్రొమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. మరోపక్క వసిష్ఠ వద్ద కూడా తన వెర్షన్ కి సంబంధించిన ‘బింభిసార 2 ‘ స్క్రిప్ట్ సిద్ధం గా ఉంది.

అతను ఆ స్క్రిప్ట్ తో వేరే హీరో ని పెట్టి సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట. మరి ఆ హీరో ఎవరు ఏమిటి అనేది ఇంకా వివరాలు బయటకి రాలేదు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న ‘విశ్వంభర’ చిత్రం మీదనే ఆయన ద్రుష్టి మొత్తం ఉందట. రీసెంట్ గానే షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని కూడా జరుపుకుంది. అతి త్వరలోనే రెండవ షెడ్యూల్ కి సంబంధించిన పనులు కూడా ప్రారంభించబోతున్నారట.

సూపర్ న్యాచురల్ పవర్స్ మీద బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అయన రేంజ్ లో పెంచుతుందో లేదో చూడాలి.