ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని తెలుసా?

0
315

ఆమె నవ్వు చూస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది. నవరత్నాలు కింద పడతాయేమో అనిపిస్తుంది. తక్కువ సినిమాలే చేసినా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. జమ్నాస్టిక్స్ లో ప్రావీణ్యం ఉన్న ఆమె.. ఆమె స్వయంగా చేసిన జమ్నాస్టిక్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా ఒక ప్రాజెక్టులో నటిస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసింది. కానీ ఆ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. ఇన్ని క్లూలు ఇచ్చినా కూడా ఈ చిన్నారి ఎవరో ఇప్పుడైనా గుర్తు పట్టారు.

ఆదాశర్మనే ఆ చిన్నారి

పై ఫొటోలో ఉన్న చిన్నారే మన అభిమాన హీరోయిన్ ఆదాశర్మ. కేరళ కుట్టి అయిన ఆదాశర్మ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి మర్చంట్ నేవీలో కేప్టెన్ గా పని చేశారు. తల్లి మాత్రం సంప్రదాయ నృత్య కళాకారిణి. ఆదా విద్యాభ్యాసం ముంబైలో సాగింది. నటి కావాలని చిన్నతనం నుంచి ఎన్నో కలలు కన్నది ఈ కేరళ కుట్టి.

ఇండస్ర్టీలో రాణించేందుకు చదువు మానేయ్యాలని అనుకోగా తల్లిదండ్రులు మందలించి కనీసం ఇంటర్ వరకైనా చదవాలని సూచించారు. వారి కోరిక మేరకు ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత తల్లి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకుంది. ‘కథక్’ లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. యూఎస్ కి వెళ్లి సాల్సా కూడా నేర్చేసుకుంది.

మంచి ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఆదా

ఇక ఆదాశర్మ సినీ కెరీర్ విషయానికి వస్తే 2008లో హిందీలో రిలీజైన్ ‘1920’తో హీరోయిన్ గా వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత ‘ఫిర్’, ‘హమ్ హై రహీ కర్ కే’ లాంటి సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లోకి ‘హార్ట్ ఎటాక్’తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘గరమ్’, ‘క్షణం’, ‘కల్కి’ సినిమాల్లో నటించి విమర్శకులను సైతం ఆశ్చర్యపోయేలా నటించింది. 2019 తర్వాత మూడేళ్లు టాలీవుడ్ ఇండస్ర్టీకి బ్రేక్ ఇచ్చిన ముద్దుగుమ్మ ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ తో మళ్లీ పలకరించింది.