నిహారికాకు సీరియస్ వార్నింగ్..! ఇక పబ్ లు లేనట్టే

0
327

సెలబ్రెటీలకు, వారి పిల్లలకు పబ్‌లు, పార్టీలు కొత్తేమి కాదు. ఎక్కువ సమయం ఎంజాయ్ చేస్తూనే గడుపుతుంటారు ఇండస్ర్టీలోని ప్రముఖుల పిల్లలు. అయితే కొందరు వివాదాల్లో చిక్కుకుంటుండగా, మరికొందరు బయట పడరు. గతంలో ఒక పబ్ లో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారంటూ పోలీసులు రైడ్ చేయగా అందులో మెగా ఇంటి కూతురు నిహారిక పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ అక్కడ ఆమె లేదని నాగబాబు, మెగా ఫ్యామిలీ చెప్పడంతో ఆ వివాదం నుంచి బయటపడింది నిహారిక. తర్వాత నుంచి పబ్ లు, పార్టీలకు దూరంగా ఉంటూ వస్తుంది.

సెలబ్రెటీల పిల్లలకూ తప్పని ట్రోల్స్

ఇండస్ర్టీలో సెలబ్రెటీలను వారి పిల్లలను ఎప్పుడూ ట్రోల్ చేయడం అనాధిగా వస్తుంది. కొంత మంది వైరల్ రాయుళ్లు మెగా ఫ్యామిలీని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారు. వీరిని కూడా ఎప్పటి కప్పుడు మెగా ఫ్యాన్స్ అడ్డుకుంటూనే ఉన్నారు. ఇలాంటి బాధలకే మరోసారి గురైంది మెగా డాటర్ నిహారిక. నిహారిక హీరోయిన్ గా సినిమాల్లో కొన్ని రోజులు నటించింది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ రాకపోవడంతో మూవీస్ నుంచి తప్పుకుంది. తర్వాతి పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన కొన్ని సనిమాలు, వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది.

అత్తింట్లో కూడా ప్రిన్సెస్

నిహారికకు, జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిగింది. తను అత్తగారింట్లో కూడా ప్రిన్సెస్ నే అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నిహారిక. తన అత్తా, మామ కూతురిలా చూస్తారని, ఇన తన భర్త అడిగింది కాదనరని చెప్పుకచ్చింది. పుట్టింట్లో కంటే అత్తింట్లోనే ఇంకా ఫ్రీడం పెరిగిందని చెప్పింది. ప్రొడ్యూసర్ గా మారిన తనకు అత్తింటి వారు బాగా సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొంది మెగా డాటర్.

నాగబాబా ఇంటి పార్టీలో కనిపించని అల్లుడు..!

ఈ నేపథ్యంలో నాగబాబు ఇంట్లో రీసెంట్ గా ఫ్యామిలీ సీక్రెట్ శాంటాను సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్ లో మెగా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కానీ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య మాత్రం కనిపించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో గాసిప్ లు బయల్దేరాయి. ‘నిహారిక పబ్ లు పార్టీలకు వెళ్లడం చైతన్య ఫ్యామిలీకి ఇష్టం లేదని, వాళ్లది డీసెంట్ ఫ్యామిలీ అంటూ చైతన్య నిహారికకు వార్నింగ్ ఇచ్చాడట.

చైతన్య చెప్పిన విషయాన్ని ఆమె పట్టించుకోకుండా పుట్టింటి పార్టీ కోసం వచ్చినట్లు’ ట్రోల్ అవుతుంది. ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో ఓ పబ్ లో పోలీసులు రైడ్ చేసిన సమయంలో నిహారిక కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నిహారిక అన్న వరుణ్ తేజ్ పబ్ లు, పార్టీలకు వెళ్లద్దని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడట.

గతంలో వార్నింగ్ ఇచ్చిన అన్న వరుణ్ తేజ్..!

ఏది ఏమైనా అత్తింటి విషయం, అన్న వార్నింగ్ విషయాలు అంతా గాసిప్ అని తేలుతోంది. ఇప్పటి వరకూ ఈ విషయాలను మాత్రం మెగా ఫ్యామిలీ కానీ, మెగా డాటర్ కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక అత్తింటి పర్మిషన్ తో పుట్టింటి వేడుకల్లో నిహారిక పాల్గొన్నట్లు కూడా మరో వైపు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.