కడసారి చూపులకు కూడా నాగార్జున ఎందుకు రాడు?

0
581

అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ర్టీలోకి ‘విక్రమ్’ సినిమాతో వచ్చారు నాగార్జున. అంతగొప్ప నట వారసత్వం నుంచి వచ్చినా మొదట్లో ఆయనకు అంత గుర్తింపు దక్కలేదు. ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటూ వచ్చాయి. నాగార్జున ఇండస్ర్టీకి వచ్చిన చాలా రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ సినిమాతో మంచి స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు నాగార్జున. ఇండస్ర్టీలో కొత్త దర్శకులు, నిర్మాతలకు ప్రథమంగా అవకాశం ఇచ్చే వారు నాగార్జున.

అందుకే ఆయనంటే అందరికీ అభిమానం. శివ తర్వాత ఆయన స్టార్ నటుడిగా మారిపోయారు. తర్వత వెంట వెంటనే సినిమాలు చేస్తూ మరింత ముందుకు దూసుకెళ్లారు. ఇటీవల ఆయన తీసిన 99 సినిమా ‘ఘోస్ట్’ డిజాస్టర్ గా మిగిలింది. తన 100వ చిత్రంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్లు కూడా చేస్తున్నారట.

కడసారి చూపునకు వెళ్లని నాగ్

అక్కినేని నాట వారసత్వంలో నాగార్జున పేరు ప్రముఖంగా చెప్పవచ్చు. నాగార్జున వారసులుగా వస్తున్న నాగ చైతన్య, అఖిల్ ప్రస్తుతం ఇండస్ర్టీలో తడబడుతూనే ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యంగ్ హీరోల కంటే వెనుకబడే ఉన్నారు. ఇటీవల పెద్ద కొడుకు చైతన్య పెళ్లి.. వెంట వెంటనే విడాకులు నాగార్జున కుటుంబాన్ని కొంచెం కలిచి వేసిందనే చెప్పాలి.

ఇవన్నీ కాసేపు పక్కన బెడితే ఇండస్ర్టీలో ఎవరైనా ప్రముఖమైన (సెలబ్రెటీ) చనిపోతే కడసారి చూపునకు నాగార్జున వెళ్లరు. ఇంత వరకూ అది జరగలేదు. ఒకే ఒక సందర్భంలో మాత్రం అది జరిగింది. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విమర్శలు ఎదుర్కొంటున్న నాగార్జున

చిత్ర సీమను అందులో ఉండే చాలా మంది ఒక కుటుంబంగా భావిస్తారు. ఒకరి కష్ట, సుఖాలలో మరొకరు పాలు పంచుకుంటారు. కానీ నాగార్జున మాత్రం శుభకార్యాలకు కుటుంబంతో సహా వెళ్తున్నా.. ఇండస్ర్టీలో ఎవరైనా చనిపోతే మాత్రం కడసారి చూపులకు కూడా రారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇది నిజం కూడా.. నాగార్జున తల్లి అన్నపూర్ణ, తండ్రి నాగేశ్వర్ రావు విడివిడిగా చనిపోయిన సందర్భంలో చిత్ర సీమలోని చాలా మంది ప్రముఖులు వారికి నివాళులు అర్పించడంతో పాటు నాగార్జునను ఓదార్చారు. కానీ నాగార్జున మాత్రం ఇంత వరకూ ఎవరి చావుకు అటెండ్ కాలేదు.

దాసరి భార్య చనిపోయినప్పుడు మాత్రమే

‘శుభ కార్యాలకు వెళ్లకున్నా.. చావుకు మాత్రం వెళ్లి కడసారి చూపు చూడాలని’ నానుడి ఎప్పటి నుంచో ఉంది. ఎవరైనా చనిపోతే అతి ముఖ్యమైన శుభకార్యాలను కూడా వదిలిపెట్టి మృతి చెందిన వారిని కడసారి చూపులకు చాలా మంది వెళ్తుంటారు. కానీ శుభకార్యాలకు కుటుంబంతో సహా వస్తున్న నాగ్ మాత్రం చివరి చూపునకు ఎందుకు వెళ్లడం లేదనే సందేహం ఇండస్ర్టీలో ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది.

అయితే దాసరి నారాయణ రావు భార్య పద్మ మృతి చెందిన మూడో రోజు నాగార్జున వెళ్లారు. దాసరిని ఓదర్చారు. అయితే అప్పుడు నాగ్ తీస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోవడంతోనే దాసరిని పరామర్శించేందుకు వెళ్లినట్లు వార్తలు కూడా వినిపించాయి.

కైకాల కడసారి చూపులో కూడా కనిపించని నాగ్

ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ మరణించిన సమయంలో కూడా నాగార్జున వారి కడసారి చూపునకు హాజరవలేదు. ఐతే కృష్ణ చనిపోయిన సమయంలో ఆయన బిగ్ బాస్ సీజన్ 6కు హోస్ట్ గా పని చేస్తున్నారు. బిగ్ బాస్ ఒక ఎపీసోడ్ లో కృష్ణకు నివాళులర్పించారు. ఆయన కొడుకు నాగ చైతన్య మాత్రం ఎవరు చనిపోయాని పరామర్శకు మాత్రం తప్పకుండా వెళ్తున్నారు. ఆ దిశగా అఖిల్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ నాగార్జున మాత్రం ఇప్పటికీ కడసారి చూపులకు రాకపోవడానికి గల కారణాలను చెప్పడం లేదు.