నయన్ విషయంలో వేణు స్వామి జోస్యం నిజమవుతుందా?

0
164

ఇటీవల సరోగసితో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నయనతార దాంపత్య జీవితంలో బిజీగా మారింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా హీరో బాలకృష్ణ తో కలిసి ‘జైసింహా’లో నటించింది. అయితే ప్రమోషన్ లో మాత్రం పాల్గొనకపోవచ్చని చిత్ర వర్గాలు హింట్ ఇస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఆమె ఎలాంటి మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొనలేదు. స్టార్ హీరో సినిమా అయినా, లేడీ ఓరియంటెడ్ మూవీ అయినా ఆమె ప్రమోషన్లకు మాత్రం దూరంగానే ఉన్నాయి.

అయితే రీసెంట్ గా ఆమె ఒక సినిమాను నిర్మించారు. దీనికి సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూలో ఆమె కొన్ని రోజులకు ముందు కనిపించారు. తన భర్త విఘ్నేశ్ శివన్ తో కలిసి నయనతార ఒక సినిమాను నిర్మించారు. అందులో ఈ జంటనే హీరో, హీరోయిన్లుగా నటించారు. లాక్ డౌన్ కాలంలో ఆత్మల నేపథ్యంలో కథాంశం ఉండబోతోంది.

వేణుస్వామి జోష్యంపై సర్వత్రా చర్చ

చిత్రం గురించి పక్కన పెడితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నయనతార దాంపత్య జీవితంపై సంచలన జోష్యం చెప్పాడు. ‘నయన తారకు వివాహం కలిసి రాదని, విడాకులు తీసుకుంటుందని’ జోష్యం చెప్పాడు. ఈ విషయం ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ర్టీలో ప్రకంపణలే పుట్టించింది. వేణు స్వామి జాతకాన్ని లైట్ గా తీసుకోలేం అంటున్నాయి చిత్ర వర్గాలు.

గతంలో నాగచైతన్యతో సమంత పెళ్లి జరిగిన నేపథ్యంలో ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదని వేణుస్వామే జోస్యం చెప్పారు. తర్వాత కొంత కాలానికి చైతూ, సామ్ విడాకులు తీసుకున్నారు. నయనతార విషయంలో కూడా ఇది ఫలిస్తుంది కావచ్చని ఆమె ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

వివాదాలతో నెగ్గుకస్తున్న జంట

అయితే నయనతార, విఘ్నేష్ శివన్ దాదాపు ఏడు సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్నారు. తర్వాత 9 జూన్, 2022న దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత నుంచి నయన తార చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. సరోగసితో పిల్లలను తల్లిదండ్రులుగా మారాలనుకున్న వారిపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని కోరింది కూడా.

ఇంటర్వెల్ లేకుంటే ఎలా

నయన తార, ఆమె భర్త ప్రొడ్యూసర్ గా తీసిన ‘కనెక్ట్’ మూవీ రిలీజ్ విషయంలో కూడా ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ సనిమాను ఇంటర్వెల్ లేకుండా ప్రదర్శిస్తున్నట్లు విఘ్నేష్ శివన్ ప్రకటించారు. అయితే థియేటర్స్ యాజమాన్యం దీనికి అడ్డు చెప్తున్నారు. ఇంటర్వెల్ లేకుండా సినిమా ఉంటే హాల్ లో ఫుడ్ కోర్ట్స్ తో వచ్చే ఆదాయం కోల్పోతామని వాదిస్తున్నారు. ఇంటర్వెల్ ఉండి తీరాల్సిందే అంటూ పట్టుబడుతున్నారట.

సినిమా నిడివి కూడా చాలా తక్కువగా ఉండడంతో షోకు, షోకూ మధ్య చాలా గ్యాప్ వస్తుందని చెప్తున్నారు. ఈ విషయం తమకు ముందుగా తెలియదని, ప్రమోషన్స్ లో దీన్ని చెప్పడంతో సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు యజమానులు అడ్డుచెప్తున్నారు. ఇంటర్వెల్ తప్పక ఉండాలని చెప్తున్నారు. విడుదలకు ఒక్కరోజే ఉండడంతో ఈ సమస్యను త్వరగా సాల్వ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.