యాంకర్ అనసూయ చెల్లెలిని చూశారా

0
1358

బుల్లితెరపై, అంతెందుకు వెండితెరపై కూడా అనుసూయ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్న చిన్న టీవీ షోల నుంచి మెల్లమెల్లగా ఎదుగుకుంటూ వచ్చిన అనసూయ వెండితెరపై అడుగుపెట్టి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఆమె కుటుంబం, కుటుంబ సభ్యులు ఎవరెలా ఉంటారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట.

అనసూయ చెల్లెలి ఫొటోలు వైరల్

రీసెంట్ గా అనసూయ తన చెల్లెలి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందట. అయితే అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె చెల్లెలు ఏం చేస్తుంది..? కొంచెం హైట్ లో తేడా ఉన్నా ట్విన్స్ లాగే కనిపిస్తున్ వీరి మధ్య ఎన్ని సంవత్సరాలు గ్యాప్..? ఇలా పలు విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

ఓ వెబ్ ఛానెట్ సీఈవోగా వైష్ణవి

అనసూయ లాగే కనిపిస్తున్న తన చెల్లెలి పేరు వైష్ణవి. ఈ మధ్య అనసూయ బుల్లితెర నుంచి వెళ్లి వెండితెరపై దాదాపుగా సెటిలైంది. ఈ నేపథ్యంలో ఆమె చెల్లెలు యాంకర్ గా ఎంట్రీ ఇస్తారనుకొని చాలా మంది జోస్యం కూడా చెప్పారు. దీంతో పాటు ఒక ఛానల్ లో ప్రసారమయ్యే రియాలిటీ షోకు యాంకర్ గా వస్తుందని రకరకాల వార్తలు తెగ వ్యాపించాయి. కానీ అవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకూ వైష్ణవి యాంకర్ గా మాత్రం రాలేదు. పైగా ఆమె ఒక మీడియా ఛానల్ కు సీఈఓగా చేస్తుందని తెలుస్తోంది. యూ ట్యూబ్, వెబ్ న్యూస్ రంగంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న ఒక ఛానల్ కు ఆమె సీఈవోగా పని చేస్తుంది.

భవిష్యత్ లో వచ్చే ఆలోచనలో

ఇప్పుడు సీఈవోగా ఉన్నా భవిష్యత్తులో తప్పకుండా యాంకర్ గా వస్తుందని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే బుల్లి తెర నుంచి వెండితెర వరకూ గ్లామర్ తో ఆకట్టుకున్న అనసూయకు పోటీగా వైష్ణవి వస్తుందా..? వేచి చూడాలి. టీవీ 9 యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ప్రస్తుతం ఇండస్ర్టీలో బిజీ యాక్టర్ గా మారింది. ఇక అనసూయ గురించి తెలుసుకుంటే చాలా సినిమాల్లో వరుస పెట్టి చేస్తున్న ఆమె షోలు, ఈవెంట్లను కూడా వదలడం లేదు. ఎడా పెడా రెండు చేతులా సంపాదిస్తుంది.

వరుస ప్రాజెక్టులతో అనసూయ బిజీ

ఇటీవల సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పలో విలన్ (సునీల్) భార్యగా నటించి ఆడియన్స్ ను మెప్పించింది. డైరెక్టర్ సుకుమార్ అనసూయను చాలా సినిమాల్లో ఎలివేట్ చేస్తూనే వచ్చారు. ప్రధాన పాత్రకు చాలా దగ్గరగా ఉండే పాత్రనే ఇస్తున్నారు. రంగస్థలంలో ఆమె వేసిన రంగమ్మత్త పాత్ర ఎంతలా హిట్టయిందో అందరికీ తెలిసే ఉంటుంది. పుష్ప ఫస్ట్ పార్టులో సునీల్ కు భార్యగా చేసిన అనసూయ దాదాపు సునీల్ నే చంపేంత పని చేస్తుంది. విలన్ కూడా అనసూయను భయపెడుతుంది.