ఇరువైపులా మొహం కూడా చూడని బంధువులు

0
440

మంచు మనోజ్ సినిమాలతో కాకుండా తన పర్సనల్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు దూరం పెట్టారని అందరికీ తెలిసిందే అయితే రెండో పెళ్లి విషయంపైనా.. లేక మరేదైనా కారణం ఉండా అనేది తెలియరావడం లేదు. కానీ ఇండస్ర్టీలో మాత్రం మనోజ్ రెండో పెళ్లి విషయంపైనే కుటుంబంలో తగాదాలు వచ్చాయని అందరూ కలిసి మనోజ్ ను దూరం పెట్టారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆయన కూడా ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

పెళ్లికి డేట్ కూడా ఫిక్స్..!

గతంలో ప్రణతిని వివాహం చేసుకున్న మనోజ్, దాదాపు రెండు సంవత్సరాలే కాపురం చేశారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. మనోజ్ నుంచి విడిపోయిన ప్రణతి అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయినట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కూతురైన మౌనికను మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారని ఇండస్ర్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పెళ్లి ఫ్రిబవరి, 2023లో ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.

మౌనికది కూడా రెండో వివాహమే

ఇక భూమా మౌనిక గురించి తెలుసుకుంటే పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా నాగిరెడ్డి రెండో కూతురే ఈ మౌనిక. ఆమెకు గతంలో మరో వ్యక్తితో పెళ్లి జరిగగా అతని నుంచి విడిపోయింది. అంటే మౌనికది కూడా రెండో వివాహమే. మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవల మౌనిక, మనోజ్ ఒక గుడిలో కలిసి చేయించుకున్న పూజతో వీరు పెళ్లి చేసుకుంటారన్న వార్తలపై క్లారిటీ రాగా. కడపలోని దర్గా వద్ద ఆయన అన్న మాటలు మరింత ప్రాణం పోశాయి.

ఇరువైపులా ఫ్యామిలీలు దూరం

మనోజ్, మౌనిక రెండో వివాహం అటు మంచు వారింటితో పాటు భూమా వారింట్లో కూడా ఇష్టం లేనట్లుగా ఉంది. అందుకు శుక్రవారం (డిసెంబర్ 16)న జరిగిన ఘటనను పలువురు విశ్లేషిస్తున్నారు. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి కావడంతో నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలో భూమా ఘాట్ కు మౌనిక మనోజ్ ను వెంటపెట్టుకొని వెళ్లింది. మౌనిక సోదరి అఖిల ప్రియ కూడా తన భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగల్ విఖ్యాత్ రెడ్డిని వెంటపెట్టుకుని తల్లికి నివాళులర్పించేందుకు వచ్చింది. మౌనిక, మనోజ్ ను పలకరించలేదు సరికదా. కనీసం చూడను కూడా చూడలేదు.

మౌనికపై భూమా ఫ్యామిలీ ఆగ్రహం

వీరున్నారని అఖిల ప్రియ సమీపంలోని భైరవ స్వామి ఆలయానికి వెళ్లింది. వీరు వెళ్లే వరకూ నిరీక్షించి తర్వాత ఘాట్ లోకి వెళ్లింది. ఏదేమైనా మంచు, భూమా ఫ్యామిలీలు వీరి పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకున్నా ఇష్టం లేదన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇటు మంచు వారు ఫ్యామిలీ మనోజ్ ను దూరం పెట్టగా, భూమా ఫ్యామిలీ కూడా మౌనికపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి పెళ్లి వివాదాలకు దారి తీస్తుందా..? లేక ఉన్న కాస్త తక్కువ సమయంలో పెద్దలను ఒప్పిస్తారా..? వేచి చూడాల్సిందే.