వారి కాంబినేషన్‌లో రావాల్సిన ఆ 3 చిత్రాలు

0
469

ఆయన టాలీవుడ్‌లో మెగాస్టార్‌.. ఆమె టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ మెగాస్టార్‌.. మరి ఈయన టాలీవుడ్‌లో మెగా దర్శకుడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే ఎంతటి సంచలనం రేపుతుందో తెలిసిందే. అదే మూడు సినిమాలు వస్తే.. అందులోనూ ఒక్కొక్క సినిమాకు వీరిలో ఒక్కొక్కరు నిర్మాతలు అయితే అది ఎంతటి సెన్సేషన్‌ వార్త అవుతుందో ఊహించండి. అలా ఊహల్లో తేలిపోయేలా చేశారు ఈ ముగ్గురు. కానీ కొబ్బరికాయ కొట్టిన తొలి చిత్రమే గుమ్మడికా కొట్టేదాకా రాక పోవడంతో ఆ ఆశలు కాస్తా నిరాశనే మిగిల్చాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్‌ చిరంజీవి`శ్రీదేవి కాంబినేషన్‌ గురించి తెలియని తొలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే చిరంజీవి`దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో సృష్టించిన సంచలనాల గురించి తెలియని నాటి తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతి శయోక్తి కాదు. మరోవైపు శ్రీదేవి`కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఈ అద్భుత కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే బాగుంటుంది అని చిరు`శ్రీదేవి`రెడ్డి గారు ప్లాన్‌ చేశారు. అయితే ఒక్క సినిమా కాకుండా మొత్తం మూడు సినిమాలు తీయాని.. ఒక్కో దానికి ఒక్కొక్కరు నిర్మాతలుగా వ్యవహరించాని ప్లాన్‌ చేశారు. ప్రతి వారి సినిమాకు మిగిలిన ఇద్దరు పారితోషికం తీసుకోకూడదు. ఆలోచన అద్భుతంగా ఉండడంతో రంగంలోకి దిగారు.

మొదటగా శ్రీదేవి నిర్మాతగా సినిమా ప్రారంభం అయింది. అప్పటికి తమిళంలో కూడా శ్రీదేవి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతుండడం, శ్రీదేవి తల్లికి తమిళ రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉండడంతో నాటి తమిళ సినీ దిగ్గజం, ముఖ్యమంత్రి యమ్జీఆర్‌ ముఖ్య అతిథిగా అంగరంగ వైభోగంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. తొలి రోజు పాట చిత్రకరణతో మొదలు పెట్టారు. అయితే అనుకోని అవాంతరాలు కేవలం పాట చిత్రీకరణతో ఆ సినిమాకు ఎండ్‌కార్డ్‌ పడిపోయింది. దీని ఎఫెక్ట్‌తో మిగిలిన 2 చిత్రాలు కూడా కనుమరుగైపోయాయి.