బిగ్ బాస్ లోకి వెళ్లి.. వీళ్ళ కొంప కొల్లేరు అయింది

0
225

బుల్లి తెరపై నవ్వులు పూయించి కమెడియన్లు బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం ఆ మేరకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. వెంట వెంటనే ఎలిమినేషన్ అవుతూ ఇంటి దారి పడుతున్నారు. బుల్లి తెరపై అంతలా రాణించిన వారికి ఈ బిగ్ బాస్ హౌజ్ ఓ లెక్కా ఇక్కడ ఏదో జరుగుతుంది అంటూ చాలా గాసిప్స్ ఉన్నాయి. అయితే వీటిపై మాత్రం ఇప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదు. ఇవన్నీ కూడా పుకార్లే అంటూ కూడా కొందరు కొట్టి పారేస్తున్నారు.

ఉత్సాహంగా సాగుతున్న షో

బిగ్ బాస్ ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఆరో సీజన్ తో చివరికి వచ్చింది. అయితే ఇప్పటికీ ఈ షోపై చాలా ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఈ షోలో గెలుపుపై ఆడియన్స్ పాత్ర ఏమైనా ఉంటుందా..? లేక ముందే విన్నర్ ను సెట్ చేసి షోలోకి పంపిస్తారా..? సరే ఆ కాంట్రవర్సీ గురించి మనకెందుకు కానీ బుల్లి తెరపై అలరించిన మనోళ్లు బిగ్ బాస్ హౌజ్ లో ఎందుకు రాణించలేకపోతున్నారో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.

బిగ్ బాస్ షోలో కి స్టార్ కమెడియన్లు

బిగ్ బాస్ ఎంతో మందికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన షో. బుల్లి తెర నుంచి ఎంతో మంది కమెడీయన్లు బిగ్ బాస్ షోలోకి వెళ్లారు. కానీ బటయకు వచ్చినా వారికి మాత్రం ఇండస్ర్టీలో అవకాశాలు దక్కడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ బిగ్ బాస్ షో కోసం జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చాడు. మల్లెమాలను విడిచి వచ్చేందుకు తన మనసు అంగీకరించలేదని అప్పట్లో చెప్పుకచ్చాడు ముక్కు అవినాష్. ఆ తర్వాత సీజన్-5లో మరో జబర్ధస్త్ ఆర్టిస్ట్ ప్రియాంక కూడా బిగ్ బాస్ లోకి వచ్చింది.

కొనసాగలేకపోతున్న కమెడియన్లు

ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్ 6లో చలాకీ చంటితో పాటు, ఫైమా స్టార్టింగ్ లో కొనసాగారు. చలాకీ చంటి దాదాపు మొదట్లోనే ఎలిమినేషన్ కు గురికాగా, ఫైమా మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేస్తూ చలా వారాలు ఇంట్లో కొనసాగింది. బిగ్ బాస్ షోలో చేయడం చాలా కష్టమని, అలాంటి షోలు తనకు పడవంటూ చలాకీ చంటి చెప్పడంతో అప్పుడు బుల్లి తెర ఇండస్ర్టీలో కొంత అలజడి నెలకొంది. అసలు జబర్ధస్త్ ఆర్టిస్టులకు బిగ్ బాస్ షో కలిసి రావడం లేదనే చెప్పాలి.

బుల్లి తెరపై కమెడీయన్లుగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న వారు హౌజ్ లో మాత్రం ఎందుకు వరుస ఎలిమినేషన్ కు గురవుతున్నారు.? ఆడియన్స్ పోల్స్ తోనే విజేతలు, ఎలిమినేషన్ ప్రకటించే షోలో వీరు చివరి వరకూ ఎందుకు ఉండలేకపోతున్నారు. అసలు వీరికి బయట నిజంగా అభిమానులు ఉన్నారా..? ఉంటే వీరికి కాకుండా సింగర్స్, యూ ట్యూబ్ స్టార్లకు ఎందుకు ఓట్ వేస్తున్నారు ఇలా చాలానే ప్రశ్నలు తిరుగుతన్నాయి.

మంచి పర్ఫారెన్స్ ఇచ్చినా ఫైమా ఎందుకు బయటకు వచ్చింది

బిగ్ బాస్ సీజన్ 6లో ఫైమా బాగానే ఆడింది. ఇప్పుడు హౌజ్ లో కొనసాగుతున్న వారికంటే ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయినా హౌజ్ నుంచి బయటకు పంపడంపై నెటిజన్లు వింతగా కామెంట్లు చేస్తున్నారు. షోలకే పరిమితమైన వీరికి పీఆర్ ను మెయింటెన్ చేయడం తెలియకపోవడంతో వల్లే వీరు హౌజ్ లో విఫలం అవుతున్నట్లు మరికొంత మంది నెటిజన్లు అంటున్నారు.

అంతా ఆడియన్స్ చేతిలోనే

ఎలిమినేషన్స్ అంతా ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. కొంత మంది కంటెస్టెంట్లు బయట ఉన్న వారి కుటుంబ సభ్యులతో పీఆర్ టీమ్ ఏర్పాటు చేసుకొని ఓటింగ్ చేస్తుంటారట.! అలాంటి పీఆర్ టీమ్ ను ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే జబర్ధస్త్ కమేడియన్లు వెనుకబడుతున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.