మహేష్ బాబు కి ఒక కన్ను పనిచెయ్యదా..ఇన్ని రోజులు ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

0
347
Mahesh Babus one eye is not functioning is a shocking truth that no one knows for so many days

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడం తో ఈ చిత్రం పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో మామూలు రేంజ్ క్రేజ్ లేదు.

టీజర్ మరియు పాటలతో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, ఇప్పుడు రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ తో ఆ అంచనాలను పదింతలు చేసింది.

ముఖ్యంగా మహేష్ ఎనెర్జిటిక్ పెర్ఫార్మన్స్ ని, ఆయన డ్యాన్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇలాంటి మహేష్ ని కదా మేము ఇన్ని రోజులు చూడాలని కోరుకున్నది అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

ఇకపోతే మొన్న విడుదలైన ట్రైలర్ లో అభిమానులు ఎవ్వరూ గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం.

ఈ సినిమాలో మహేష్ బాబు కి ఒక కన్ను కనిపించదట. ట్రైలర్ లో మాటికొస్తే మహేష్ ఒక్క కన్నుతో చూడడం ని అభిమానులు మ్యానరిజం అని అనుకున్నారు.

కానీ అది మ్యానరిజం కాదట, మహేష్ కి చిన్నతనం లో ఒక అగ్ని ప్రమాదం లో కంటి మీద నిప్పు పడుతుంది. అప్పటి నుండి ఆయనకీ ఒక కన్ను పనిచెయ్యడట.

Bramhanamdam Pan India Comedy in this new year 2024

అలా హీరోలో ఉన్న లోపాన్ని కూడా మ్యానరిజం గా మార్చే గురూజీ టేకింగ్ కి సెల్యూట్ చెయ్యాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం లో తల్లి సెంటిమెంట్ ఒక రేంజ్ లో పండింది అని అంటున్నారు.

అంతే కాకుండా చివరి 20 నీంసిహాలు అత్తారింటికి దారికి రేంజ్ సెంటిమెంట్ పండింది. త్రివిక్రమ్ డైలాగ్స్ అద్భుతంగా కుదిరాయట.

ఇక పాటల విషయానికి వస్తే మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నడూ లేని రేంజ్ లో ఈ సినిమాలో డ్యాన్స్ వేసాడట. అది మనం ప్రోమోస్ లో చూస్తేనే అర్థం అవుతుంది.

అది కేవలం టీజర్ మాత్రమేనట, సినిమాలో మహేష్ బాబు ప్రతీ పాటకి అదిరిపోయే రేంజ్ స్టెప్పులు వేసాడట. ఇలా ఎన్నో విశేషాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎన్ని వండర్స్ ని క్రియేట్ చెయ్యబోతుందో చూడాలి.