పాన్ ఇండియా చిత్రం లో బ్రహ్మానందం..ఈసారి కామెడీ మామూలుగా ఉండదు!

0
196

హీరోలకు కాకుండా , కమెడియన్స్ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మనం ఏ ఇండస్ట్రీ లో కూడా చూసి ఉండము, కానీ మన టాలీవుడ్ లో బ్రహ్మానందం కి మాత్రం చూసాము.

ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఒక స్టార్ హీరో కి ఎలాంటి రెస్పాన్స్ అయితే వస్తుందో, అంతకు మించిన రెస్పాన్స్ వస్తుంది. ఒకానొక దశలో ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు.

కేవలం బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడు అనే కారణం చేత, థియేటర్స్ కి క్యూలు కట్టిన ఆడియన్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలా ఆయన మేనియా ఒక దశాబ్ద కాలం పాటు సాగింది.

అంతే కాకుండా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన చరిత్ర ఆయనది. అయితే ఈమధ్య కాలం లో ఆయన సినిమాల్లో కనిపించడం లేదు. అందుకు కారణం ఆయన గుండెకి సర్జరీ జరగడం వల్లే.

జీవితానికి సరిపడ కాదు, తన కుటుంబం లో ఏడు తరాలు కూర్చొని తిన్నా తరిగిపోని సంపదని సంపాదించాడు. అంతే కీర్తి ప్రతిష్టల విషయం లో హిమ పర్వతం స్థాయి అతనిది.

సినిమా అవకాశాలు ఆయనకీ రాక కాదు, ఆయనే వద్దు అనుకున్నాడు. అయితే రీసెంట్ గా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆయన సినిమాల్లో కనిపిస్తున్నాడు.

DillRaju does not only films he also plays tata

పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు ‘బ్రో’ మరియు ‘భీమ్లా నాయక్’ సినిమాల్లో కనిపించాడు. అలాగే ‘రంగమార్తాండ’ అనే చిత్రం లో అద్భుతమైన పాత్ర కూడా పోషించాడు.

వీటితో పాటు ‘కీడకోలా’ అనే చిత్రం లో కూడా చేసాడు గత ఏడాదిలో. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘గేమ్ చేంజర్’ చిత్రం లో కూడా నటిస్తున్నాడట.

ఈ సినిమాలో వింటేజ్ బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ని చూడొచ్చు అని అంటున్నారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఇక నుండి ఆయన కేవలం అభిమానుల కోసం మాత్రమే ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలు చేస్తాడని టాక్. ఇది బ్రహ్మానందం ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అనే చెప్పాలి. చూడాలి మరి బ్రహ్మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది.