బాలయ్య బాబు పాన్ ఇండియా మూవీ ఫిక్స్

0
293

యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు సీనియర్ స్టార్ హీరో బాలయ్య. తన భారీ బడ్జెట్ చిత్రానికి డిసెంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాట. భారీ తారాగణంతో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని తెచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి.

NBK-108 గా పేరు

ఈ ప్రాజెక్టుకు NBK-108గా పేరు పెట్టారు చిత్ర యూనిట్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇది త్వరలో పూజా కార్యక్రమాలు చేసుకుంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలకృష్ణ పుట్టిన రోజున ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా ప్రకటించారు. అప్పటి నుంచి చిత్ర సీమలో భారీ హైప్ క్రియేటైంది. చాలా రోజులుగా దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఇటీవల షూటింగ్ ప్రారంభ విషయాలను చిత్రయూనిట్ చెప్పుకచ్చింది.

డిసెంబర్ 8న షెట్స్ పైకి మూవీ

NBK-108 ప్రాజెక్టును డిసెంబర్ 8, 2022న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తామని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో బాలకృష్ణ సరసన సోనాక్షి సింహా నటించనుండగా అర్జున్ రాంపాల్ విలన్ గా చేయనున్నారని తెలుస్తోంది. ఒక కీలక పాత్ర కోసం శ్రీలలను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

హరీశ్ పెద్ది భారీ బడ్జెత్ తో

సాంకేతిక నిపుణులు, మిగతా తారాగణాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపటి, హరీశ్ పెద్ది భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతారని చిత్ర వర్గాలు లీక్ ఇచ్చాయి. మిగతా వివరాలను అతి త్వరలో ప్రకటిస్తామని మూవీ యూనిట్ చెప్పింది.