కాజల్ శాపం ఊరికే పోలేదు.. అడ్రస్ లేని డైరెక్టర్..!

0
338

కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఆమె అందం పెద్ద పెద్ద స్టార్ హీరోలను కూడా కట్టిపడేస్తుంది. ఇక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో హిందీ చిత్రాల్లో నటించిన ఆమె ‘లక్ష్మీ కల్యాణం’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ‘చందమామ’తో బాక్సాఫీస్ హిట్ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఆమె 50కి పైగా చిత్రాల్లో నటించారు. సినీ విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులను కూడా అందుకున్నారు.

కాజల్ ది పంజాబీ కుటుంబం

ముంబైలోని పంజాబీ కుంటుంబంలో పుట్టింది కాజల్. ఆమె తల్లి మిఠాయి వ్యాపారం చేస్తుండగా, తండ్రి వస్ర్త వ్యాపారం చేస్తుండేవారు. కాజల్ కాజల్ కు చిన్న తనం నుంచే ఇండస్ర్టీకి వెళ్లాలని కలలు కనేది. ఆ దిశగా అడుగులు కూడా వేసింది. మొదట మోడల్ గా గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత హిందీ చిత్ర సీమ (బాలీవుడ్)లో అడుగుపెట్టి క్రమ క్రమంగా తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషా చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. టాప్ డైరెక్టర్లతో పని చేసిన ఆమె క్రమశిక్షణ గురించి ఇండస్ర్టీ గుర్తుంచుకుంటుంది.

కెరీర్ ప్రారంభంలో సెన్సిటివ్ గా ఉండేది

కాజల్ చాలా సెన్సిటివ్. మృధు స్వభావం కలనటి. కోపం వచ్చినా సరే అంత తేలికగా బయటపడదు. తనలో తనే బాధపడుతుంది కానీ ఆ కోపాన్ని ఎవరిపై చూపించదు. తన కెరీర్ ప్రారంభంలో ఆమెకు ఇదే మైనస్ గా మారింది. ‘ఆడదాని ఏడుపైనా, శాపమైనా ఊరికే పోదని’ మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఒక డైరెక్టర్ తో సినిమా తీస్తున్న సందర్భంలో సదరు డైరెక్టర్ ఆమెను బాగా వేధించే వాడట. అతన్ని ఏమీ అనలేక తన పాత్రను తాను చేస్తూ లోలోపల కుమిలిపోతూ ఉండేదాన్నని కాజల్ చెప్పుకచ్చింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది.

కాజల్ శాపం ఫలించింది

కాజల్ పట్ల ఆ డైరెక్టర్ ఎంత మిస్ బిహేవియర్ చేసినా ఆయనను పట్టించుకునేది కాదట. సినిమా ఇండస్ర్టీలోకి కొత్తగా వచ్చిన సమయం కాబట్టి ఇలాంటివి ఉంటాయని ఆమెకు తెలియవట. అప్పటికీ ఆమె పెద్దగా ఫేమ్ కాలేదు. తను ఈ విషయాన్ని బయటపెడితే తన కెరీర్ కు మచ్చ వస్తుందని లోలోనే కుమిలిపోయేదట. ఎలాగోలా భరిస్తూ సినిమాను పూర్తి చేసిన కాజల్ చాలానే శాపనార్థాలు పెట్టినట్లుంది. ఆమె శాపం తగిలిన ఆ డైరెక్టర్ ఇండస్ర్టీలోనే కనిపించకుండా పోయాడు. దీనిపై కాజల్ అభిమానులు కూడా సంతోష పడుతున్నారట.

సెకెండ్స్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న ముద్దుగుమ్మ

కాస్టింగ్ కౌచ్ ను ధీటుగా ఎదుర్కోవాలని కూడా ఆమె అభిమానులు సూచిస్తున్నారు. అప్పుడంటే అలా సైలెంట్ ఉంది కానీ ఇప్పుడైతే తన స్టయిల్ లో వార్నింగ్ ఇస్తుంది కాజల్. 6 అక్టోబర్, 2020న గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించి, 30 అక్టోబర్ 2020ను వివాహం చేసుకున్నారు. వివాహం కూడా సాదాసీదాను చేసుకున్నారు కాజల్ ఇటీవల 19 ఏప్రిల్, 2022న బాబుకు జన్మనిచ్చిన కాజల్ ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టింది కాజల్ అగర్వాల్. వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్తూ దూసుకుపోతుంది.