ఆ ఒక్క తప్పే నాని కెరీర్ కు శాపం.. వరుస ప్లాపులకు అదే కారణమా..?

0
366

సాధారణ నటనతో ప్రేక్షకులను అలరించడంలో ‘నాని’ ఎప్పుడూ పైచేయి సాధిస్తాడు. అందుకే అతనికి ‘న్యాచురల్ స్టార్’ అని ఇండస్ర్టీ బిరుదు కూడా ఇచ్చింది. నానీ కథను ఎంచుకోవడంలో ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాలను ఫ్యామిలీతో హాయిగా చూసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా హీరో ఓరియంటెడ్ కామెడీ పాత్రల్లో రాణించిన నాని వరుసగా ప్లాప్ ల బాట పడుతున్నారు. కమర్షియల్ కథలను ఎంచుకోవడం ఆయన వెనుకపడుతున్నాడని సినీ విశ్లేషకులు ఎప్పటి నుంచో సూచిస్తూనే ఉన్నారు.

వరుసగా నిరాశను మిగిలిస్తున్న మూవీస్

ఈ మధ్యనాని తీసిన సినిమాలు వరుసగా హిట్లకు దూరంగా ఉంటున్నాయి. ‘వీ’, ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’ ఇవన్నీ కూడా థియేటర్లలో, ఓటీటీల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. నాని మాస్, క్లాస్ వర్గాల ప్రేక్షకులను మెప్పించే స్ర్కిప్టులను ఎంచుకుంటారు. కొన్ని కామెడీ టచ్ లో మరికొన్ని ఎమోషనల్, హీరోయిజమ్ కు సంబంధించినవిగా ఉంటాయి. కానీ కొంత కాలంగా నాని వీటిని పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఎక్కువగా కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్న నాని కథ, కథనాన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

కమర్షియలే కొంప ముంచుతుందా

కథ, కథనాన్ని పట్టించుకోకుంటే ఎంత పెద్ద హీరో అయినా రాణించడం చాలా కష్టం. దీనికి నాని కూడా అతీతుడు కాదు. ఆయన ఈ మధ్య ఎంచుకున్న చాలా సబ్జెక్టులు కమర్షియల్ గానే సాగాయి. కంటెంట్ లో అంత డెప్త్ ఉండకున్నా. కమర్షియల్ గా రాణిస్తుంది అనుకున్నంటున్నాడు. నాని కానీ అక్కడ కూడా ఆయనకు దెబ్బే అని చెప్పక తప్పదు. ఈ కారణంతో బక్సాఫీస్ మాట దేవుడెరుగు ప్లాపులను ఎదుర్కోవలసి వస్తుంది నాని. నాని తర్వాతి ప్రాజెక్టు కు కొత్త దర్శకుడిని ఎంచుకున్నాడట.

తర్వాతి ప్రాజెక్టుపై ఆశలు

ఈ మూవీ దసరా 2023 వరకు రిలీజ్ అవుతుందని ఇండస్ర్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాపైనే ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారట. ఏ మేరకు ఉంటుందో చూడాలి మరి. మూవీస్ లో వరుస ప్లాపులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాని ఇప్పుడు ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నాడు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ చిత్రాలను నిర్మిస్తున్నాడు. నాని ప్రొడక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీగా ‘హిట్: ది సెకండ్ కేస్’ రిలీజైంది. ఇది ప్రస్తుతం థియేటర్లలో బాగానే ఆడుతోంది.

ప్రొడ్యూసర్ గా

దీనికి సంబంధించి ఫ్రాంచైజీని కూడా తీసుకున్నారట నాని. ఇక హిట్ కు సంబంధించి ప్రతీ ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్ తో కొత్త మూవీ వస్తూనే ఉంటుంది. ఇంకా ఓటీటీ వేదికగా కూడా తన సోదరి దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీజ్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇది ఆశించిన రేంజ్ లో ఆడలేదు. ఏది ఏమైనా తమ అభిమాన నటుడు మూవీస్ లో సక్సెస్ కాలేకపోతున్నా. ప్రొడక్షన్ లో అయినా సక్సెస్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.