ఎన్టీఆర్ విడిచిపెట్టిన మూవీలన్నీ బక్సాఫీస్ లే.. ఇక చెర్రీ వంతు

0
272

సానా బుచ్చిబాబు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అని ప్రకటించాడు. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ అంతలోనే ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్‌తో సినిమా ప్రకటించాడు. సానా బుచ్చిబాబుతో సినిమా ట్రాక్ తప్పిందనే వార్తలు పుకార్లు వ్యాపించాయి.

తన తదుపరి చిత్రాన్ని ఓ స్పోర్ట్స్ డ్రామా కథతో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌తో చేసేందుకు రెడీ అయినట్ల టాక్. తన సినిమా కంప్లీట్ చేసే దాకా చెర్రీ డేట్స్ లాక్ చేసుకున్నాడని తెలుస్తున్నది. రామ్ చరణ్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే బుచ్చిబాబు ప్రాజెక్టులో జాయిన్ కానున్నాడు.

ఎన్టీఆర్ వదిలేస్తే సూపర్ హిట్టే

ఎన్టీఆర్ వదిలేసిన సినిమాను మరొకరు చేస్తే సూపర్ హిట్ అవుతుందని టాక్. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన మొదటి చిత్రం ఎన్టీఆర్ తోనే చేయాల్సింది. స్టోరీ ఫైనల్ అయ్యాక సీన్ మారిపోయింది. ఆ కథను ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ ను హీరోగా, నిర్మాతగా నిలబెట్టింది. అలాగే ఇదే డైరెక్టర్ కిక్ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కే చెప్పాడు. కానీ ఆ సినిమాను రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు. అదే డైరెక్టర్ తో ఊసరవెల్లి సినిమా చేశాడు.

వరుస ప్లాఫులతో కెరీర్

కిక్ సినిమాను మించి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నా ఫలితం మాత్రం తేడా కొట్టింది. పటాస్ సినిమాతో డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి కూడా ముందు ఎన్టీఆర్ తోనే సినిమా చేయాల్సింది. కానీ పటాస్ సినిమాను కళ్యాణ్ రామ్ తో చేసి సక్సెస్ అయ్యాడు. వరుస ప్లాఫులతో కెరీర్ ముగిసిందనుకున్న సమయంలో కళ్యాణ్ రామ్ కు పటాస్ మరోసారి హీరోగా నిలబెట్టింది. సేమ్ టైమ్ అనిల్ రావిపూడి కూడా డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. తమిళ్ రిమేక్ బిల్లా ముందు ఎన్టీఆర్ చేయాల్సింది. కానీ ఎంతో మంది హీరోలు మారుతూ ప్రభాస్ కు చేరింది. స్టైలిష్ కమ్ యాక్షన్ హీరోగా రెబల్ స్టార్ కు మరింత ఇమేజ్ ను క్రియేట్ చేసింది.

టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్

ఇదే మాఫియా అండ్ రివేంజ్ డ్రామాతో మెహర్ రమేశ్ తో చేసిన కంత్రీ సినిమా ఎన్టీఆర్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలాగే తెలుగులో సూపర్ హిట్టయిన బొమ్మరిల్లు సినిమా ఆఫర్ కూడా ముందు ఎన్టీఆర్ కే వచ్చింది. కానీ అప్పటికే మాస్ హీరోగా ఎలివేట్ కావడంతో తనకు ఆ సినిమా సెట్ కాదు అని వదిలేశాడు. అదే కథతో తమిళ హీరో సిద్ధార్థ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇలా ఎన్నో కథలను ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథలను వేరే హీరోలు యాక్సెప్ట్ చేసి సూపర్ హిట్లు కొట్టారు.

ఇప్పుడు రామ్ చరణ్ వంతు

ఇక బుచ్చిబాబు సానా ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ సినిమా ప్రస్తుతం రామ్ చరణ్ తో కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ కు ఈ ఐదేళ్లలో కేవలం రెండు సినిమాలు చేశాడు. ఆచార్య మూవీ ఫ్లాప్ అయినా కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేశాడు. తన బర్త్ డే ముందు రోజు గ్లింప్స్ కూడా విడుదల చేశాడు. అంతలోనే బుచ్చిబాబు సానాతో సినిమా ఉంటుందని చెప్పాడు. కానీ ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు. ఉప్పెనకు ముందు బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సింది. కానీ అదీ వర్క్ అవుట్ కాలేదు.

రామ్ చరణ్ ఖాతాలో మరో సూపర్ హిట్

కానీ ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్టు కొట్టాడు. అదే కోవలో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా రామ్ చరణ్ తో చేస్తున్నాడని టాక్. ఈ కథ ఎన్టీఆర్ కు చెప్పిందేనా లేక వేరే కథనా బుచ్చిబాబు చెబితే కానీ చెప్పలేం. కానీ ఎన్టీఆర్ ను వీడి వేరే హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్లు సూపర్ హిట్లు కొట్టారు. ఇప్పడు రామ్ చరణ్ వంతు వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే రామ్ చరణ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్లేనని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.