అక్షరాలా 1600 షోలు..డిసెంబర్ 31న ఖుషి గ్రాండ్ రీ రిలీజ్

0
530

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులు ఎలా పులరించిపోతారో మనకి తెల్సిందే..ఆయన సినిమా విడుదల అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పెద్ద పండుగ జరుగుతుందా అనే అనుభూతి కలుగుతుంది..ఎక్కడ చూసిన బ్యానర్లు, కటౌట్లు, బైక్ ర్యాలీలు, అన్నదానాలు ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సమయం పడుతుంది..అలాంటి క్రేజ్ ఫ్యాన్ బేస్ ఆయనకి రావడానికి కారణం కెరీర్ ప్రారంభం లో ఆయన చేసిన సినిమాలు.

ఎంతో మంది కుర్ర హీరోలు

వాటిల్లో ముందుగా మనం ఖుషి గురించి మాట్లాడుకోవాలి..అప్పటి వరుకు కేవలం నలుగురు హీరోలలో ఒకరిగా కొనసాగిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో నెంబర్ 1 స్టార్ హీరో గా నిలిచాడు..ఖుషి తర్వాత ఆయనకి పెద్దగా హిట్స్ రాలేదు..సుమారు పదేళ్ల పాటు తన రేంజ్ హిట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది..ఈ గ్యాప్ లో ఎంతో మంది కుర్ర హీరోలు వచ్చారు..ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్లు కొట్టారు..కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయారు.

క్వాలిటీ థ్రిల్లింగ్ అనుభూతి

ఆయనకి వచ్చే ఓపెనింగ్స్ ఏ స్టార్ హీరో కి కూడా వచ్చేవి కాదు..ఒక్క మెగాస్టార్ చిరంజీవి కి తప్ప..అలాంటి క్రేజ్ ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం..అలాంటి సినిమాని ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు..4K క్వాలిటీ తో డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో ఈ చిత్రాన్ని మార్చారు..అభిమానులకు కచ్చితంగా ఆ క్వాలిటీ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందట..డిసెంబర్ 31 వ తారీఖు నుండి జనవరి 6 వరుకు ఈ చిత్రం నడవబోతుంది.

రికార్డ్స్ బద్దలయ్యే విధంగా

కేవలం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కోసం వేసుకున్న ఒకే ఒక్క రోజు స్పెషల్ షోస్ కి 3 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే , వారం రోజులు పాటు నాన్ స్టాప్ గా ప్రదర్శించబోతున్న ఖుషి కి ఎలాంటి వసూళ్లు రావాలి??, కచ్చితంగా రికార్డ్స్ బద్దలయ్యే విధంగా ఉంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..మరి ఖుషి మూవీ జల్సా రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా లేదా అనేది తెలియాలంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.