నిరాశపర్చిన ‘అవతార్ 2 ‘ కలెక్షన్స్..వేలకోట్లు నష్టం

0
702

గ్లోబల్ వైడ్ గా సీక్వెల్స్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మన అందరం ప్రత్యక్షం గా చూసాము. టాలీవుడ్ ,బాలీవుడ్, కోలీవుడ్ మరియు హాలీవుడ్ అయినా కానీ సీక్వెల్స్ కి ఉండే క్రేజ్ ఎంత క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసుకున్నా రాదు. అందుకే ఇప్పుడంతా సీక్వెల్స్ ట్రెండ్ లో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా అవతార్ 2 థియేటర్స్ లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అవతార్ పార్ట్ 1 చిత్రం 2009 వ సంవత్సరం లోనే ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

ఒక రేంజ్ అంచనాలు

అప్పటి టికెట్ రేట్స్ తో ఈ రేంజ్ వసూళ్లు అంతే అసాధారణమైన విషయం. ఆ చిత్ర రికార్డ్స్ ని ఇప్పటికీ ఎవ్వరు అందుకోలేకపోయారు. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ ఆ టాక్ కి తగిన రేంజ్ లో లేవు.

కేవలం 450 మిలియన్ డాలర్స్

ముందుగా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 500 మిలియన్ డాలర్లు వస్తుందని ఊహించారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ సంగతి కాసేపు పక్కన పెడితే కనీసం వీకెండ్ మొత్తం పూర్తయిన తర్వాత కూడా ఈ చిత్రానికి 500 మిలియన్ డాలర్స్ రాలేదు. కేవలం 450 మిలియన్ డాలర్స్ మాత్రమే వచ్చాయి. ట్రేడ్ ఊహించినట్టు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి 500 మిలియన్ డాలర్స్ వచ్చి ఉండుంటే, మూడు రోజులకు కలిపి 1.5 బిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చి ఉండేవి. కానీ అలా జరగలేదు. అంచనాలన్నీ తారుమారయ్యాయి.

ఓవర్సీస్ తో పోలిస్తే

ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం మూడు రోజులకు కలిపి 140 కోట్ల రూపాయిల గ్రాస్ అన్ని భాషలకు కలిపి వసూలు చేసింది. ఓవర్సీస్ తో పోలిస్తే ఇక్కడే కాస్త మంచి వసూళ్లు వచ్చాయని చెప్పాలి. ఓపెనింగ్స్ దెబ్బతిన్నప్పటికీ లాంగ్ ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. ఆ అంచనాలు ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.