కెరీర్ పీక్ లో ఉండగానే కన్నుమూసిన మన తారలు

0
535

తక్కువ సమంలోనే నటలో మంచి గుర్తింపు పొంది చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని వీడి పోయారు కొందరు తారలు.. అయినా తమ నటనతో వెండితెరపై, అభిమానుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే మంచి చిత్రాలను ఇచ్చారు. గత 20 ఏళ్లలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 12 మంది వర్థమాన తారలు ఈ లోకాన్ని వీడి పోయారు. ఇందులో కొందరిని ప్రమాధం కబలిస్తే, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు వ్యాధులతో తనువు చాలించారు. వారెవరో ఇక్కడ చూద్దాం..

దివ్య భారతి

తెలుగు ఇండస్ర్టీలో దాదాపు 30 సంవత్సరాల క్రితం వరుస హిట్లతో దూసుకుపోయింది దివ్య భారతి. రౌడీ అల్లుడు, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, ధర్మక్షేత్రం, ఇలా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె అప్పటి ప్రముఖ నిర్మాత సాజిద్ నడియడ్ వాలాను వివాహం చేసుకుంది. ఆమె ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి జారి పడి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

సౌందర్య

సౌందర్య అంటే ఇప్పటి జనరేషన్ వారు కూడా గుర్తు పడతారంటే ఆమె సినిమాలు ఏ మేరకు ప్రభావితం చేశాయో అర్థమవుతుంది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు ఆమె. తన మేనబావను వివాహం చేసుకుంది. అయితే బీజేపీలో చేరిన ఆమె 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలీకాప్టర్ లో కరీంనగర్ సభకు వెళ్తున్న క్రమంలో కూలిపోయి దుర్మరణం చెందింది. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో ప్రేక్షకులు తీవ్రంగా కలత చెందారు.

ప్రత్యూష

బుల్లి తెర నుంచి వెండితెరకు వచ్చింది ప్రత్యూష. 2000 సమయంలో ఆమె నటనలో దూసుకుపోయింది. సుమంత్, ఉదయ్ కిరణ్ కు జోడీగా, ఇటు మహేశ్ బాబు కూతురిగా కూడా నటించి మెప్పించింది. ఆమె కెరీర్ టాప్ లో ఉండగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్నేహితుడు సిద్దార్థ రెడ్డిపై అప్పట్లో అనుమానాలు ఉన్నాయి.

ఆర్తీ అగర్వాల్

తారా జువ్వలా టాలీవుడ్ లో ఒక్కసారిగా ఎదిగిపోయిన హీరోయిన్ ఆర్తీ అగర్వాల్. ప్రభాస్, తరుణ్, ఎన్టీఆర్ తో అనేక సినిమాలలో నటించారు ఆమె. కెరీర్ లో మంచి ప్రాజెక్టులు లేకపోవడంతో వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొందరగానే విడాకులు కూడా తీసుకుంది. తర్వాత నాజూగ్గా కావాలని అనుకొని ఆపరరేషన్ చేయించుకుంది. కానీ ఆపరేషన్ వికటించి ఆమె మరణించింది.

సిల్క్ స్మిత

టాలీవుడ్ లో కలల రాణిగా సిల్క్ స్మిత స్థానం సంపాదించుకుంది. మొదలు ఆమె ఐటం గర్ల్ గానే వచ్చినా కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలను కూడా పోషించింది. అప్పట్లో ఆమె డ్యాన్స్ చూసేందుకు యువకులు క్యూ కట్టేవారంటే సందేహం లేదు. హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత. అప్పులు ఎక్కువ కావడం, దానికి తోడు మందుకు బానిసై ఆత్మహత్య చేసుకుంది.

భార్గవి: అష్టాచెమ్మలో నటించిన భార్గవి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా పేరుతోనే దాదాపు ఆమెను పిలిచే వారు. అష్టా చెమ్మా భార్గవి అంటేనే గుర్తు పట్టే వారు. అంతలా నటించిన ఆమె ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.

పునీత్ రాజ్ కుమార్: అన్నడ కంఠీరవ కుమారుడైన పునీత్ రాజ్ కుమార్ కన్నడలో పవర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 20 సంవత్సరాల తన కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్లు ఉన్నాయి. ఆయన ఇటీవల గుండెపోటుతో మరణించాడు. దీంతో కన్నడ చిత్ర సీమతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు కన్నీరు కార్చారు.

ఉదయ్ కిరణ్: చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో ఉదయ్ కుమార్. నువ్వునేను, మనసంతా నువ్వే లాంటి బాక్సాఫీస్ హిట్లను తీసిన ఆయన అప్పటి స్టార్ హీరోలకే చెమలు పట్టించాడంటే అతిశయోక్తి కాదు. తర్వాత కెరీర్ చాలా డల్ అయిపోవడం పెళ్లి, కుటుంబ సభ్యుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ధోనీ సినిమాతో రాజ్ పుత్ విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయనకు అమ్మాయిలు ఎక్కువగా ఫ్యాన్ ఉండేవారు. అయితే ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి చేసిన మోసంతో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని టాక్ ఉంది.

కునాల్: ‘ప్రేమికుల రోజు’ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయ్యాడు కునాల్. ఆయన అనారోగ్య సమస్యలు, కుటుంబ ఒత్తడిని తట్టుకోలేకే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయసాయి, యశోసాగర్: టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉన్న విజయసాయి, యశోసాగర్ కూడా కెరీర్ పీక్ లో ఉండగానే మరణించారు.